Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ సెన్సేషన్ లో జక్కన్న పాత్ర చాలానే ఉందట
By: Tupaki Desk | 31 Aug 2020 12:30 PM GMTసౌత్ ఇండియా సినిమాల స్థాయిని చాటి చెప్పిన సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో బాలీవుడ్ రికార్డులను సైతం బద్దలు కొట్టిన రాజమౌళిపై నమ్మకంతో కేజీఎఫ్ ను హిందీలో మరియు తెలుగులో విడుదల చేసేందుకు బయ్యర్లు ముందుకు వచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా కేజీఎఫ్ హీరో యశ్ చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినిమాను భారీ యాక్షన్ సీన్స్ తో అయితే తీశాం కాని విడుదల విషయంలో కాస్త ఆందోళన ఉండేది. ఆ సమయంలో బెంగళూరులోని ఒక హోటల్ లో రాజమౌళి గారిని అనుకోకుండా కలుసుకోవడం జరిగింది. ఆ సమయంలో కొన్ని నిమిషాల పాటు తమ కోసం సమయం కేటాయించాలంటూ విజ్ఞప్తి చేసి మేము అప్పటికే తీసిన కొన్ని సీన్స్ ను ఆయనకు చూపించడం జరిగింది. మా షాట్స్ నచ్చిన ఆయన తెలుగు మరియు హిందీలో బిజినెస్ అయ్యేలా మాట్లాడారు. ఆయన చెప్పడం వల్లే సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు బయ్యర్లు ముందుకు వచ్చారు.
సినిమా ఎంత బాగా తీసినా కూడా విడుదల సమయంలో తీసుకునే జాగ్రత్తలు మరియు విడుదల చేసిన తీరును బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. మా సినిమాకు రాజమౌళి గారు బ్రాండ్ అంబాసిడర్ మాదిరిగా మారి సాయం చేశారంటూ యశ్ నిగర్వంగా జక్కన్న రాజమౌళి గురించి చెప్పడం జరిగింది. గతంలో దర్శకుడు ప్రశాంత్ కూడా ఇదే మాదిరిగా వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు రాజమౌళి ని ఆకాశానికి ఎత్తుతూ యశ్ కూడా కామెంట్స్ చేయడంతో జక్కన్న కేజీఎఫ్ అంతటి సెన్సేషన్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించారంటూ ఆయన అభిమానులు గొప్పగా చెబుతున్నారు.