Begin typing your search above and press return to search.
కోదండ రామిరెడ్డి కలని నిజం చేసిన రాజమౌళి!
By: Tupaki Desk | 5 Sep 2022 8:37 AM GMTఇండస్ట్రీలోకి ప్రవేశించే వారు కోటి ఆశలతో ఈ రంగంలోకి ఎంటరవుతుంటారు. అనుకున్న వన్నీ జరక్క పోయినా కొన్ని డ్రీమ్స్ మాత్రం ఖచ్చితంగా నెరవేరతాయి. అయితే కొంత మందికి ఎన్నేళ్లైనా అవి నెరవేరవు. 90వ దశకంలో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన సీనియర్ దర్శకుడు ఏ. కోదండ రామిరెడ్డికి కూడా ఓ కల తీరలేదట. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణతో ఈ దర్శకుడు ఇచ్చిన సూపర్ హిట్ లు ఇండస్ట్రీలో ఏ దర్శకుడు ఇవ్వలేదు.
మెగాస్టార్ తో 'కిరాయి రౌడీలు', న్యాయం కావాలి, అభిలాష, ఖైదీ, ఛాలెంజ్, గూండా, రుస్తుం, దొంగ, కిరాతకుడు, రక్త సింధూరం, విజేత, రాక్షసుడు, వేట, దొంగ మొగుడు, జేబు దొంగ, పసివాడి ప్రాణం, మరణ మృదంగం, త్రినేత్రుడు, అత్తమకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ వంటి ఎవర్ గ్రీన్ మూవీస్ ని అందించారు. ఇక బాలకృష్ణతో 'అనసూయమ్మగారి అల్లుడు', భానుమతిగారి మొగుడు, భార్గవ రాముడు, రక్తాభిషేకం, తిరగబడ్డ తెలుగు బిడ్డ, భలే దొంగ, నారీ నారీ నడుమ మురారి, ధర్మక్షేత్రం, నిప్పురవ్వ, బొబ్బిలి సింహం, మాతో పెట్టుకోకు వంటి సినిమాలు చేశారు.
అయితే ఈ మెగా, నందమూరి హీరోలతో భారీ మల్టీస్టారర్ మూవీని చేయాలనే కల వుండేదట కోదండరామిరెడ్డికి. అయితే 90వ దశకంలో ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య భారీ స్థాయిలో రైవర్లీ నడిచేదని, అలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలలో మల్టీస్టారర్ చేయడానికి కోదండరామిరెడ్ది భయపడ్డారట. ఎక్కడా ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత ఎదురవుతుందోనని తన చిరకాల డ్రీమ్ ని పక్కన పెట్టారట.
అయితే ఆ డ్రీమ్ ని ఇండైరెక్ట్ గా రాజమౌళి ఇన్నేళ్లకు తీర్చారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణతో కోదండ రామిరెడ్డి చేయలేకపోయిన మల్టీస్టారర్ ని రాజమౌళి 'RRR' తో చేసి చూపించారని చెప్పుకుంటున్నారు.
ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన విషయం తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణ తరంతో కోదండరామిరెడ్డి చేయలేకపోయిన ఫీట్ ని తరువాత తరమైన రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి చేసి చూపించడం విశేషం.
ఆ విధంగా ఇండైరెక్ట్ గా కోదండ రామిరెడ్డి కలని రాజమౌళి నిజం చేశారన్నమాట. అయితే గతంలో కోదండరామిరెడ్డి ఫ్యాన్స్ విషయంలో భయపడినట్టుగానే 'RRR'లోనూ రామ్ చరణ్ ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రామ్ చరణ్ ఫ్యాన్స్ నెట్టింట టార్గెట్ చేసి నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. అయినా ఇవన్నీ పట్టించుకోకుండా రాజమౌళి తాను అనుకున్నట్టుగా 'RRR'ని తెరకెక్కించి అసాధ్యం అనుకున్న ఫీట్ సుసాధ్యం చేసి శభాష్ అనిపించుకోవడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.