Begin typing your search above and press return to search.
రాజమౌళి మహాభారతం.. ఏ పాత్ర ఎవరికి..?
By: Tupaki Desk | 12 May 2023 4:30 AM ISTబాహుబలి తర్వాత రాజమౌళి క్రేజ్ ఆమాంతం పెరిగిపోయింది. దానికి ముందు వరకు కేవలం టాలీవుడ్ లో మాత్రమే ఉండే గుర్తింపు, బాహుబలి తర్వాత దేశమంతా పాకింది. ఇక ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. ఒక తెలుగు పాట కు ఆస్కార్ సాధించిన ఘనత కూడా ఆయనదే. ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని హీరో, హీరోయిన్లు పరితపిస్తూ ఉంటారు. ఇతర భాషల హీరోలు కూడా ఆ అవకాశం వస్తే బాగుండు అని చూస్తున్నారు.
రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి చాలాసార్లు బయటపెట్టారు. మహాభారతం ని సినిమా గా తీయాలని అనేది తన డ్రీమ్ అని ఆయన చెప్పారు. ఇటీవల కూడా ఆయన ఆ విషయాన్ని చెప్పగా, ఏ పాత్ర కు ఎవరైతే బాగా సెట్ అవుతారా అని అందరూ ఇమాజిన్ చేసుకోవడం మొదలు పెట్టారు. తమ హీరో కూడా ఈ సినిమాలో భాగం కావాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఎవరు ఏ పాత్ర చేస్తే బాగుంటుందో కొందరు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది వైరల్ గా మారింది.
కృష్ణుడిగా మహేష్ బాబు, దుర్యోదనుడిగా రానా, కర్ణుడిగా ప్రభాస్, ధర్మరాజుగా పవన్ కళ్యాణ్, భీముడిగా ఎన్టీఆర్, అర్జునుడుగా రామ్ చరణ్, నకుడుగా అడవి శేష్, సహదేవ్ గా నిఖిల్, అభిమన్యుడుగా అఖిల్, ఏకలవ్యుడిగా సందీప్ కిషన్, పరశురామ్ గా బాలకృష్ణ, అశ్వథామ గా అల్లు అర్జున్ బాగుంటారంటూ ఓ రీల్ షేర్ చేశారు. మీరు ఎవరు ఏ పాత్రకు సెట్ అవుతారని అనుకుంటున్నారో చెప్పండి అంటూ క్యాప్షన్ జత చేశారు. దీని పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.
అయితే, ఈ నేపథ్యంలో మరో విషయం హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి తాను మహాభారతం తీస్తే 10 భాగాలుగా తీస్తానని చెప్పారు. దీంతో నిజంగానే ఈ హీరోలందరినీ సినిమా కోసం ఎంపిక చేస్తే, తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని కౌంటర్లు వేస్తున్నారు. రాజమౌళి ఒక సినిమా తీయడానికి రెండు నుంచి మూడేళ్లు తీసుకుంటారు. ఇక పది భాగాలంటే, ఆ హీరోలంతా ఇక ఆ సినిమాకే పరిమితమవ్వాలి అని కౌంటర్లు వేస్తున్నారు.
ఇటీవల ఓ యువకుడు చిన్న పిల్లలతో ప్రాంక్ వీడియో తీశాడు. అందులో పిల్లలందరినీ సరదాగా కారు ఎక్కించుకొని తర్వాత కిడ్నాప్ చేశానంటూ షాకిస్తాడు. దీంతో పిల్లలు తెగ భయపడతు ఉంటారు. ఆ వీడియలో రాజమౌళి, హీరోల ఫేసులు పెట్టి ఎడిట్ చేసి నెట్టింట షేర్ చేశారు. రాజమౌళి ఈ హీరోలతో సినిమా చేస్తే, హీరోల పరిస్థితి ఇలానే ఉంటుందని, ఇక సినిమా పూర్తయ్యే వరకు ఆయనతోనే ఉండాలని, మరో సినిమా చేయడానికి ఉండదని కౌంటర్లు వేస్తున్నారు. ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.