Begin typing your search above and press return to search.
రాజమౌళి - మహేష్ ప్రాజెక్ట్ ఫుల్ డిటైల్స్
By: Tupaki Desk | 11 May 2022 12:30 AM GMTరాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ 'ట్రిపుల్ ఆర్'. లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమురం భీం ల కథకు ఫిక్షనల్ అంశాలని జోడించి తెరకెక్కించిన చిత్రమిది. 1920 కాలం నాటి కథతో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించారు. మార్చిలో విడుదలైన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. రూ.1100 కోట్ల పై చిలుకు వసూళ్లని రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.
మరోసారి దేశ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాని సగర్వంగా చాటి చెప్పింది. దీంతో ఈ మూవీ తరువాత చేయనున్న ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 'ట్రిపుల్ ఆర్' తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని ప్రారంభించారు కూడా.
లక్ డౌన్ సమయంలో ఖాలీ టైమ్ లభించడంతో తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ తో కలిసి ఈ చిత్ర కథా చర్చల్లో పాల్గొన్న రాజమౌళి ఫైనల్ గా రెండు లైన్ లని పైనల్ చేశాడు. అందులో మహేష్ కు పర్ఫెక్ట్ అనుకున్న కథని లాక్ చేశామని ఇటీవల రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ ని పక్కాగా పూర్తి చేయడానికి రాజమౌళి దాదాపు ఆరు నెలల సమయం తీసుకోబోతున్నాడట.
అంతే ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది పట్టాలెక్కడం అసాధ్యం అని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ కి ఆరు నెలల సమయం పడితే ప్రీ ప్రొడక్షన్ కి మరింత సమయం అవసరం వుంటుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది పట్టాలెక్కడం కష్టమే అని తెలుస్తోంది. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం త్రివిక్రమ్ తో చేయనున్న ప్రాజెక్ట్ ని నవంబర్ వరకు ఫినిష్ చేసి మహేష్ డిసెంబర్ లో రాజమౌళి ప్రాజెక్ట్ లో ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడట. కానీ ఇప్పడు ప్లాన్ మారింది.
అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ముందు మహేష్ 2 నుంచి 3 నెలల పాటు తనకు కేటాయించాలని రాజమౌళి కండీషన్ పెట్టారట. ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి 2 నుంచి 3 నెలల పాటు ప్రత్యేకంగా ప్రిపరేషన్స్ చేయించి ఆ తరువాతే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాలన్నది రాజమౌళి ఆలోచిన.దీంతో ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది అంటే 2023 ప్రధమార్థంలో సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు. మహేష్ షూట్ కి రెడీ అయ్యేలోపే ఎంటైర్ టీమ్ ని ఫిక్స్ చేయాలని, ఆ తరువాతే షూటింగ్ ప్రారంభించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఈ భారీ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ నిర్మించబోతున్నారు.