Begin typing your search above and press return to search.
రాజమౌళి తన పుట్టినరోజున అభిమానులకు ట్రీట్ ఇస్తాడా..?
By: Tupaki Desk | 9 Oct 2019 1:35 PM GMTదర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్ ఆర్ ఆర్'. ఈ సినిమా హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం రాజమౌళి ఇంకా ప్రమోషన్స్ ఏం స్టార్ట్ చేయలేదు. చాలా నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టినపుడు ఒక పోస్టర్ బయటకొచ్చింది. ఆ తర్వాత ఆ సినిమాకి సంబందించిన ఏ రకమైన ప్రమోషనల్ స్టఫ్ బయటకి రాలేదు. బాహుబలి స్టార్ట్ చేసినప్పటి నుండి విడుదల అయ్యేవరకు ఏదో ఒక రకంగా ప్రమోషన్ చేసిన రాజమౌళి ఈ సినిమాకి ఇంకా ప్రమోషన్ మొదలు పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అయితే రేపు రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఏదొక పోస్టర్ రిలీజ్ చేస్తారని ఇండస్ట్రీలో గుసగుసలు వినపడుతున్నాయి. అయితే ఏదైనా రిలీజ్ చేస్తారా...? లేదా...? అన్నది ఇంకా తెలియాలి. ఈ సినిమాకి సంబంధించి ఒక్క పోస్టర్ అయినా రిలీజ్ చేస్తారేమో అని రాజమౌళి ఫ్యాన్స్ - ఎన్టీఆర్ ఫ్యాన్స్ - రాంచరణ్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. రాజమౌళి తన పుట్టిన రోజైన అభిమానుల కోరిక తీరుస్తాడా...? ఇంకా వెయిట్ చేయిస్తాడా..?అనేది ఇంకొకరోజు ఆగితే కానీ తెలియదు.