Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' టీమ్ తో జక్కన్న సమావేశం...?

By:  Tupaki Desk   |   16 Jun 2020 9:14 AM GMT
ఆర్.ఆర్.ఆర్ టీమ్ తో జక్కన్న సమావేశం...?
X
దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ కొన్ని గైడ్ లైన్స్ పాటిస్తూ షూటింగ్స్ చేసుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. దీంతో చిన్న పెద్ద సినిమాలు షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దర్శకధీరుడు రాజమౌళి చాలా గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' పై పడింది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎలా నిర్వహిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ మెంబెర్స్ మరియు ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్యతో ఓ మీటింగ్ ఏర్పాటు చేసాడంట. 'ఆర్.ఆ.ఆర్' షూటింగ్ స్టార్ట్ చేయడం గురించి.. క్రైసిస్ వలన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉండబోతోంది అనే పలు విషయాలపైన చర్చించారట. టీమ్ మొత్తం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి రెట్టింపు ఉత్సహంతో 'ఆర్.ఆర్.ఆర్' కోసం పనిచేద్దామని సూచించాడట. అంతేకాకుండా ముందుగా వేసుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు అంతగా ఉండకపోవచ్చని.. అయినా సరే 'ఆర్.ఆర్.ఆర్' మంచి ప్రాఫిట్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారట. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ట్రయిల్ షూట్ చేయాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే ట్రయిల్ షూట్ లో పాల్గొని.. దాని ఫీడ్ బ్యాక్ ని చూసి రెగ్యులర్ షూటింగ్ వెళ్లాలని డిసైడ్ అయ్యారట.

కాగా 'ఆర్.ఆర్.ఆర్'లో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ లు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామ రాజు'గా కనిపిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో భారీ మల్టీస్టారర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం యావత్ సినీ అభిమానులు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ నటీనటులతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక జక్కన్న ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు విడుదల తేదీలను మార్చుకున్న 'ఆర్.ఆర్.ఆర్' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా బయటకి వచ్చేలా కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.