Begin typing your search above and press return to search.

చిన్నారులకు రాజమౌళి సందేశం

By:  Tupaki Desk   |   13 May 2017 4:43 AM GMT
చిన్నారులకు రాజమౌళి సందేశం
X
బాహుబలి విజయకేతనం తరువాత ఇప్పుడు రాజమౌళి మళ్ళీ తరవాత ఏంటి ? అనే ప్రశ్న నుండి దూరంగా తిరుగుతున్నాడు. అతనికి ఇష్టమైన పనులు చేసుకుంటూ నచ్చినా వారిని కలుస్తూ మంచి విరామం తీసుకుంటున్నాడు. ఈ విరామం లోనే నెమ్మదిగా తన ఫ్యూచర్ ప్రాజెక్టు పనులు కూడా కానిస్తున్నాడు.

రాజమౌళి శుక్రవారం విశాఖపట్నం వెళ్ళి జగ్గరాజుపేట గ్రీన్‌ సిటీలో కొత్తగా నిర్మించిన లక్ష్యా బ్యాడ్మింటన్‌ అకాడమీని ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. “దేశంలో ద్రోణాచార్యులు చాలామంది ఉన్నారు ఇక్కడ కావలిసింది ఏకాగ్రత పట్టుదల లక్ష్యం ఉన్న అర్జునులు కావాలి. ద్రోణాచార్యులు అడిగిన ప్రశ్నకు అర్జునుడు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుందని చెప్పాడు అలా చూసిన వాడికే లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం అవుతుంది. కష్టం చూసినవాడు తెలిసినవాడే రాణించి గొప్పగా ఎదుగుతాడు” అని అన్నారు. విశాఖ సాగర తీరంలో ఉండేటప్పుడు సినిమాయే జీవితంగా గడిపినట్లు తెలిపారు.

బాహుబలి లాంటి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ ఒక యంగ్ అకాడమీకు వెళ్ళి వాళ్ళను ఉత్తేజపరచడం అక్కడ వాళ్ళందిరికి కొత్త శక్తి ఇచ్చింది. ఈ కార్యక్రమంలో విశాఖ ఒలింపిక్‌ అధ్యక్షులు మాణిక్యాలరావు, రమా రాజమౌళి, శ్రీవల్లి, కీరవాణి కూడా పాల్గొన్నారు. అక్కడ చిన్నారులుతో కాసేపు ఆడి తన క్రీడా స్పూర్తి ని చాటుకున్నారు రాజమౌళి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/