Begin typing your search above and press return to search.
రాజమౌళి అడుగేశాడు.. ఇక మెరుపులే
By: Tupaki Desk | 26 Nov 2017 5:49 AM GMTఎన్టీఆర్-ఏఎన్నార్.. ఎన్టీఆర్-కృష్ణ.. కృష్ణ-కృష్ణం రాజు.. కృష్ణంరాజు-శోభన్ బాబు.. ఇలా ఒకప్పటి అగ్ర హీరోలందరూ ఏ భేషజాలూ లేకుండా మల్టీస్టారర్లు చేసిన వాళ్లే. ఒకరి మధ్య ఒకరికి ఎంత పోటీ ఉన్నా.. అభిమానుల మధ్య కూడా విభేదాలున్నా.. అవేమీ పట్టించుకోకుండా మల్టీస్టారర్లు చేసి అలరించారు అప్పటి అగ్ర హీరోలు. కానీ వీరి తర్వాతి తరం హీరోలు మాత్రం వారిలా కలిసి నటించలేదు. దీంతో మల్టీస్టారర్లకు తెరపడిపోయింది. స్టార్ హీరోలందరూ ఎవరికి వారే అన్నట్లు తయారయ్యారు. కొన్ని దశాబ్దాల పాటు తెలుగులో మల్టీస్టారర్ల ఊసే లేదు. ఐతే ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’లో మహేష్-వెంకటేష్ కలిసి నటించడంతో మళ్లీ మల్టీస్టారర్లకు కొంచెం ఊపు వస్తుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా ఆశించిన మార్పు కనిపించలేదు.
కానీ ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా చేయడానికి సిద్ధమవుతుండటంతో టాలీవుడ్లో అనూహ్యమైన మార్పులు రావడం ఖాయమని భావిస్తున్నారు. మహేష్-వెంకీ కలిసి నటించినప్పటికీ వాళ్లిద్దరి కాంబో వేరు.. ఎన్టీఆర్-చరణ్ కాంబో వేరు. సమకాలీనులు.. ఒకే రేంజ్ స్టార్లయిన ఇద్దరు నటిస్తే దానికి వచ్చే క్రేజే వేరు. ఈ సినిమా రిలీజవ్వడానికంటే ముందే ఇలాంటి సెన్సేషన్ కాంబినేషన్లు మరికొన్ని తెరమీదికి రావచ్చని భావిస్తున్నారు. ఇలాంటి కాంబోలు సాధ్యం కావన్న ఉద్దేశంతో రచయితలు.. దర్శకులు ఆ దిశగా ఆలోచించడం మానేశారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్-చరణ్ వేసే అడుగుతో అందరి ఆలోచనలూ మారుతాయి. మరిన్ని మల్టీస్టారర్ స్టోరీలు రెడీ అవుతాయి. రాజమౌళి సినిమా అంచనాల్ని అందుకుంటే భవిష్యత్తులో తెలుగులో సెన్సేషనల్ మల్టీస్టారర్లు మరిన్ని చూడొచ్చేమో.