Begin typing your search above and press return to search.
రాజమౌళి-ఎన్టీఆర్-సూర్య.. ఓ మల్టీస్టారర్
By: Tupaki Desk | 21 March 2016 7:47 AM GMTఇంకా బాహుబలి-2 రిలీజవ్వడానికే ఏడాదికి పైగా సమయం ఉంది. ఐతే అప్పుడే రాజమౌళి తర్వాతి సినిమా ఏంటో తెలుసుకోవడానికి జనాలు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఇండస్ట్రీలో కూడా ఈ విషయమై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ‘బాహుబలి’తో సంబంధం లేకుండా బాహుబలి ప్రపంచాన్ని మాత్రం కొనసాగిస్తూ.. ఆ కోవలోనే ఓ సినిమా తీస్తానని స్వయంగా రాజమౌళే ఇంతకుముందు ప్రకటించాడు. అందులో ప్రభాస్ నటించడని కూడా చెప్పేశాడు. అప్పట్నుంచి జక్కన్న తర్వాతి సినిమాలో నటించే హీరో ఎవరు అన్న ప్రశ్న జనాల్ని వేధిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ తో జక్కన్న మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తాడు అన్న ప్రశ్న అతడి అభిమానుల్నీ తొలిచేస్తోంది.
ఐతే ఈ రెండు ప్రశ్నలకు సమాధానం వచ్చే ఏడాది దొరకొచ్చని సమాచారం. రాజమౌళి తర్వాతి సినిమాలో ఎన్టీఆరే హీరో అని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంతే కాదు.. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య కూడా మరో కథానాయకుడిగా నటిస్తాడట. రాజమౌళితో పని చేయడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ సూర్య చాలాసార్లు చెప్పాడు. అతను బాహుబలి-2లో నటిస్తాడని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఐతే ఎన్టీఆర్-సూర్య కాంబినేషన్లో చారిత్రక నేపథ్యంలో తన తర్వాతి సినిమా తెరకెక్కించాలని జక్కన్న భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ ఆలోచన తండ్రికి చెప్పి కథ సిద్ధం చేయిస్తున్నాడట. బాహుబలి షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఈ కథ ఓ కొలిక్కి రావచ్చని.. దానికంటే ముందు అధికారిక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు.