Begin typing your search above and press return to search.

బాహుబలి తర్వాత బాలీవుడ్ కే అంటున్నారు

By:  Tupaki Desk   |   16 Dec 2016 5:30 AM GMT
బాహుబలి తర్వాత బాలీవుడ్ కే అంటున్నారు
X
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి.. మరో రెండు వారాల్లో బాహుబలి షూటింగ్ పూర్తి చేసేయనున్నాడు. నాలుగేళ్లుగా ఒకే ప్రాజెక్టు కోసం కష్టపడిన జక్కన్న.. ఇంకా నాలుగు నెలలు అంటే ఏప్రిల్ 28న బాహుబలి2 రిలీజ్ వరకూ ఆ ప్రాజెక్ట్ పైనే కంప్లీట్ గా కాన్సంట్రేట్ చేయడం ఖాయం. మరి జక్కన్న తీయబోయే మరుసటి చిత్రం ఏంటి అనే ప్రశ్నకు బోలెడన్ని సమాధానాలు ఉన్నాయి.

గరుడ అనే టైటిల్ పై పౌరాణిక చిత్రం తీస్తాడని.. దీనిలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తాడనే టాక్ ఉంది. ఇది మల్టీ స్టారర్ కూడా అని చెబుతున్నారు. మరోవైపు మహాభారతం తీయాలని ఉందంటూ.. రాజమౌళి స్వయంగా చెప్పిన మాటలు కూడా గుర్తుంచుకోవాలి. ఇక కేఎల్ నారాయణ నిర్మాణంలో.. మహేష్ బాబుతో రాజమౌళి ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో వార్తల్లో నానుతోంది. అయితే.. జక్కన్న మాత్రం ఇవేవీ కాదని.. బాలీవుడ్ మూవీ తీసేందుకు రెడీ అయిపోతున్నాడట.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తో రాజమౌళి నెక్ట్స్ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని మీటింగ్స్ ఈ రూమర్స్ కు బలాన్నిస్తున్నాయ్ కూడా. బాహుబలి ప్రమోషన్స్ పూర్తయిన దగ్గర నుంచి ఆమిర్ ప్రాజెక్ట్ పైనే దృష్టి పెడతాడట రాజమౌళి. మరి ఈ కొత్త కబుర్లు నిజమో కాదో జక్కన్నే తేల్చాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/