Begin typing your search above and press return to search.
జక్కన్నపై కన్నడిగుల గరం గరం?
By: Tupaki Desk | 26 Feb 2018 2:14 AM GMTపైకి చెప్పినా చెప్పకపోయినా కన్నడ దర్శక నిర్మాతలకు బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన రాజమౌళికి కొంత గ్యాప్ ఉంది. దానికి ప్రధాన కారణం బాహుబలి 2 విడుదల సమయంలో రేగిన వివాదాలు. గత ఏడాది బాహుబలి 2ని భారీ ఎత్తున కర్ణాటకలో విడుదల చేస్తున్నప్పుడు స్థానిక నిర్మాతల మండలి సభ్యులు దాని మీద తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. అప్పటికే విడుదలైన ఒక సినిమా నిర్మాత థియేటర్ల వద్ద ఏకంగా నిరాహార దీక్ష చేసినంత పని చేసాడు. ఇది కాకుండా బాహుబలి 2ని తెలుగులో కాకుండా కన్నడ డబ్ చేసి విడుదల చేసేలా మినహాయింపు తెచ్చుకునేందుకు ఆర్కా మీడియా చాలా గట్టి ప్రయత్నాలు చేసినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కాని ఎట్టి పరిస్థితుల్లోను ఇతర బాషా సినిమాలు కన్నడలో డబ్ చేయకూడదు అనే కఠిన నిర్ణయానికే వాళ్ళు కట్టుబడి ఉండటంతో చివరికి తెలుగు - తమిళ - హింది వెర్షన్లు విడుదల చేసారు.
కట్ చేస్తే ఇటీవలే బెంగుళూరులో 10వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ జరిగింది. ముఖ్య మంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన వారం రోజుల పాటు వీటిని ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా పలు బాషల నుంచి దర్శకులను - నిర్మాతలను దీనికి ఆహ్వానించారు. మన రాజమౌళికు కూడా ఇన్విటేషన్ పంపారు. కారణం తెలియదు కాని జక్కన్న మాత్రం వెళ్లలేకపోయారు. ఇప్పుడు దీని గురించే కర్ణాటక చలనచిత్ర అకాడమీ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర సింగ్ బాబు ఫైర్ అవుతున్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి వారంలో ఒక్క రోజు అందులో కేవలం కొద్ది గంటలు ఇక్కడికి వచ్చే వీలు లేకపోయిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజమౌళి కారణాలు తనకు ఉండొచ్చు కాని ఒక్కసారి వస్తే బాగుండేది కదా అని అభిప్రాయపడ్డారు. రాజమౌళి మాత్రమే కాదు మిగిలిన తెలుగు సెలెబ్రిటీలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయని అందరూ హ్యాండ్ ఇచ్చారని అన్నారు.
ఇప్పుడు ఈ రెండు ఘటనలకు లింక్ ఉందని చెప్పలేం కాని శాండల్ వుడ్ మీడియా మాత్రం దీన్ని ఇలాగే ఆపాదించుకుంటోంది. సిఎం లెవెల్ లో జరుగుతున్నప్పుడు ఓ సారి వచ్చి వెళ్లి ఉంటే బాగుండేదని, కావాలని చేసారా అని ప్రశ్నార్థకాలు పెడుతూ రకరకాల కథనాలు వండి వడ్డించేసారు. మరి జక్కన్న స్పందన దీని మీద ఎలా ఉంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.