Begin typing your search above and press return to search.

RRR: అసలు రాజీపడని జక్కన్న

By:  Tupaki Desk   |   28 Oct 2019 2:10 PM GMT
RRR: అసలు రాజీపడని జక్కన్న
X
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ ఏదని అడిగితే వెంటనే రాజమౌళి 'RRR' అని చెప్పాల్సి ఉంటుంది. తెలుగు ప్రేక్షకులే కాదు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ విషయంలో ఈమధ్య కొన్ని అనుమానాలు నెలకొన్నాయి కానీ అలాంటిదేమీ లేదని ముందుగా అనుకున్న సమయానికే 'RRR' రిలీజ్ అవుతుందని రీసెంట్ గా చరణ్ క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రస్తుతం రీ షూట్ మోడ్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. ఈమధ్య చరణ్ 'సైరా' రిలీజ్.. ప్రమోషన్స్ తో బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ తో రాజమౌళి కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారట. చరణ్ తో అవసరం లేని ఎపిసోడ్లు కావడంతో ఎన్టీఆర్ ఫుల్ స్వింగ్ లో షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఈ ఎపిసోడ్లకు సంబంధించిన రషెస్ ను చూసినప్పుడు రెండు సీక్వెన్సులు జక్కన్నకు పూర్తిగా సంతృప్తికరంగా అనిపించలేదట. దీంతో ఆ సీన్లలో కొంతభాగం పోయినవారం మరోసారి చిత్రీకరించారు. రీషూట్ లో ఎన్టీఆర్.. ఇతర తారాగణం పాల్గొన్నారని సమాచారం. మిగతా భాగాన్ని త్వరలోనే రీషూట్ చేస్తారట.

కొన్నేళ్ళ క్రితం రీషూట్ అంటే నెగెటివ్ అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు అది మారింది. క్వాలిటీ విషయంలో రాజీపడకుండా రీషూట్ చేయడమే ఉత్తమమని ఎక్కువమంది ఫిలింమేకర్స్ అభిప్రాయం. ఇక రాజమౌళి సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.. అందుకంటే ఆయన అలా క్వాలిటీ కోసం చెక్కుతూ ఉంటారు కాబట్టే ఆయనను జక్కన్న అనే పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. ఈ రీషూట్ సంగతి పక్కనపెడితే సోమవారం నాడు చరణ్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారట. హైదరాబాద్ లోనే షూటింగ్ జరుగుతోందని సమాచారం.