Begin typing your search above and press return to search.
కంక్లూజన్ క్లైమాక్స్ లో జక్కన్న కన్ఫ్యూజన్
By: Tupaki Desk | 8 March 2017 12:54 PM GMTబాహుబలి ది కంక్లూజన్.. ఇప్పుడు దేశం మొత్తం ఎదురుచూస్తున్న అద్భుత చిత్రం. రిలీజ్ తర్వాత ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేయడం ఖాయం అనే అంచనాలున్నాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు నుంచి.. బోలెడన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం జనాలు ఎదురుచూస్తున్నారు.
అయితే.. ఈ మూవీ క్లైమాక్స్ విషయంలో రాజమౌళి ఇంకా కన్ఫ్యూజన్ కు గురవుతున్నాడని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తియిపోయినా.. ఈ సినిమా కోసం 4 క్లైమాక్స్ లను చిత్రీకరించారట. కనీసం టీం మెంబర్స్ కు కూడా స్టోరీలోని కీలకమైన పాయింట్స్ లీక్ కాకుండా ఉండేందుకే ఇలా చేశారని తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు చేతిలో ఉన్న 4 క్లైమాక్స్ లలో సినిమాలో ఏది సెట్ చేయాలనే విషయంలో జక్కన్న తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నాడని అంటున్నారు. అయితే.. బాహుబలి మొదటి భాగం సాధించిన ప్రచండ విజయం కారణం.. రెండో భాగం మరింత మిన్నగా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు జక్కన్న. కానీ మరోవాదన కూడా వినిపిస్తోంది.
క్లైమాక్స్ విషయంలో రాజమౌళిలో గందరగోళం అంతా ఆయన సృష్టేనని.. ఈ విషయంలో అసలు సమాధానం బైటకు పొక్కకుండా ఉండడం కోసమే ఇలా చెబుతున్నారని అనే వాళ్లు కూడా ఉన్నారు. ఏదేమైనా.. ఓసారి రాజమౌళి "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అంచనా వేయడం అంత తేలిక కాదు.. అసలు సాధ్యం కాదు" అని చెప్పినట్లుగానే ఉంది పరిస్థితి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/