Begin typing your search above and press return to search.
హిందీని నమ్ముకునే బాహుబలి తీశాడా?
By: Tupaki Desk | 29 May 2017 4:15 AM GMTబాహుబలి2 ఘన విజయం సాధించి ఇప్పటికే 1500 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా సాధించి రికార్డుల దుమ్ము దులిపేసింది. తెలుగువాడి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. కానీ ఇందుకు ఓ ప్రాజెక్టుపై ఏకంగా 5 ఏళ్లకు పైగా కష్టపడాల్సి వచ్చింది. తమ కష్టం కంటే.. నిర్మాతలు చేసిన ఖర్చు కనిపించేదని అన్నాడు రాజమౌళి.
'మొదటి భాగానికి మొదటి రోజున నెగిటివ్ టాక్ వచ్చింది. హిందీ నుంచి పాజిటివ్ రిపోర్టులు ఉన్నా.. సూపర్ అన్నా.. మనకు ఇక్కడ బేస్ కదా.. టెన్షన్ వచ్చింది. నేను ప్రభాస్ ఇలా అందరం రెండేళ్లు కష్టపడ్డాం. కానీ నిర్మాతలు బాహుబలి మొదటి భాగాన్ని 40 కోట్లు డెఫిసిట్ తో రిలీజ్ చేశారు. అయితే బాహుబలి1 సక్సెస్ తర్వాత ఎక్కడా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నిర్మాత నాకు ఎప్పటికప్పుడు చెప్పేవారు కానీ.. తగ్గించుకోమని అనలేదు. అయితే మేమేమీ గుడ్డిగా పని చేయలేదు. ఎప్పుడూ విననంత స్థాయిలో ఫిగర్స్ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. హిందీ నుంచి ఈ బడ్జెట్ రాబట్టుకోగలం అనే విషయం తెలుసు. అర్ధమైంది కూడా' అన్నాడు జక్కన్న.
ఇదంతా చూస్తే.. బడ్జెట్ విషయంలో అంత ఎక్కువ పెట్టేసే ధైర్యం చేయడం అనే అంశం వెనక.. బాలీవుడ్ ఆడియన్స్ పై ముందు నుంచి నమ్మకం ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ బాలీవుడ్ జనాలు సౌత్ సినిమాలను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తుంటారు. దానికి సమాధానంగా 'మనం తెలుగు సినిమాలను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తే.. వాళ్లు 7 రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తారు. ఆర్థికంగా ముందుంటారు కాబట్టి.. మనపై చిన్నచూపు ఉండడం అనేది సహజమే. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి వారి కంటే పెద్ద హిట్ కొట్టాం కాబట్టి.. మనకి ఆ సుపీరియర్ ఫీలింగ్ ఉండడంలో తప్పులేదు' అన్నాడు రాజమౌళి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/