Begin typing your search above and press return to search.

బాహుబలి 2 షూటింగ్‌.. అప్పటివరకు..

By:  Tupaki Desk   |   9 July 2016 4:12 AM GMT
బాహుబలి 2 షూటింగ్‌.. అప్పటివరకు..
X
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు ఫుల్లు బిజీగా ఉన్నాడు. బాహుబలి పార్ట్ 2 అయిన బాహబలి ది కంక్లూజన్ కు క్లైమాక్స్ షూటింగ్ చేయడంలో నిమగ్నమైపోయాడు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభంలో వరుసగా అప్ డేట్స్ ఇచ్చిన బాహుబలి టీం.. ఈ మధ్య సైలెంట్ అయిపోవడానికి కారణం ఆయా సన్నివేశాల క్వాలిటీపై దృష్టి పెట్టడమే.

బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ కు రాజమౌళి దగ్గర పక్కా ప్లాన్ ముందు నుంచే ఉంది. 70 రోజులు షూటింగ్ చేయాలని నిర్ణయించడంతో పాటు.. ఇందుకోసం భారీ బడ్జెట్ నే కేటాయించారు. ఒక్క క్లైమాక్స్ షూటింగ్ కోసమే 30 కోట్ల రూపాయల బడ్జెట్ ని వెచ్చిస్తున్నారంటే.. బాహుబలి ది కంక్లూజన్ క్లైమాక్స్ రేంజ్ అర్ధమవుతుంది. ఇప్పుడు ఈ క్లైమాక్స్ విషయంలో రాజమౌళి డిమాండ్స్ మరింతగా పెరుగుతున్నాయట. 30 కోట్ల బడ్జెట్ మాటేమో కానీ.. తను ముందుగా డిసైడ్ చేసుకున్న 70 రోజుల షూటింగ్ సరిపోదని అంటున్నాడట రాజమౌళి.

ముందుగా అనుకున్న ప్లానింగ్ మాత్రమే కాకుండా.. మరో 20 రోజులు అదనంగా షూట్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నాడట జక్కన్న. కీలక సన్నివేశాల విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు ప్రధాన తారాగణమంతా పాల్గొనాల్సిన సన్నివేశాలు కావడంతో.. అనుకున్న సమయం కంటే ఎక్కువగా పడుతోందని తెలుస్తోంది. ఆగస్ట్ నెలాఖరుకు క్లైమాక్స్ షూటింగ్ కంప్లీట్ కావాల్సి ఉండగా.. లేటెస్ట్ గా జక్కన్న డిమాండ్స్ ప్రకారం.. బాహుబలి 2 క్లైమాక్స్ షూటింగ్ సెప్టెంబర్ చివరివరకూ కంటిన్యూ అయే ఛాన్స్ ఉందన్న మాట.