Begin typing your search above and press return to search.
సైలెంట్ గా చక్కబెట్టేస్తున్న బాహుబలి
By: Tupaki Desk | 30 Nov 2016 3:30 PM GMTబాహుబలి ది కంక్లూజన్ కోసం టాలీవుడ్ తో పాటు దేశమంతా ఆత్రంగా ఎదురుచూస్తోంది. మొదటి భాగంలో దర్శకుడు రాజమౌలి వదిలిన పజిల్స్ కు ఆన్సర్స్ తెలుసుకునేందుకు బాగానే ఉత్సాహం చూపిస్తున్నారు ఆడియన్స్. జూన్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి.. బాహుబలి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుండగా.. కొన్ని వారాలుగా చిన్న అప్ డేట్ కూడా రావడం లేదు.
బాహుబలి నిర్మాతలపై ఐటీ దాడులు.. బాహుబలి2 వార్ ఎపిసోడ్ కొంత లీక్ కావడం మినహాయిస్తే.. షూటింగ్ కి సంబంధంచిన లేటెస్ట్ అప్ డేట్స్ తెలియలేదు. అయితే.. ఈ పరిస్థితుల్లో వివరాలు వెల్లడించడం బ్యాడ్ సిగ్నల్స్ పంపుతుందనే ఉద్దేశ్యంతో.. కావాలనే మీడియాకు దూరంగా ఉంటున్నారట జక్కన్న అండ్ టీం. అలాగే ఐటీ దాడుల దెబ్బకు షూటింగ్ నెమ్మదించిందనే టాక్ కూడా ఉంది. అయితే.. షూటింగ్ ఏ మాత్రం స్పీడ్ తగ్గలేదని.. షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తున్నారని.. దాదాపుగా షూటింగ్ చివరి దశకు వచ్చేసిందని తెలుస్తోంది. ఒక పాట.. కొన్ని సీన్స్ మినహాయిస్తే.. మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోయిందట.
వీటిని కూడా ఫినిష్ చేసేసి.. డిసెంబర్ 31న గుమ్మడికాయ కొట్టేసేలా ప్లాన్ చేశాడట రాజమౌళి. కొన్ని రోజుల ముందే పూర్తయే అవకాశం ఉన్నా.. డిసెంబర్ 31ని బాహుబలి యూనిట్ మొత్తానికి మెమరబుల్ డేగా మార్చేందుకే ఇలా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28 బాహబలి ది కంక్లూజన్ థియేటర్లలోకి రావడం అయితే ఖాయమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/