Begin typing your search above and press return to search.
బాహుబలి2 కోసం రాజమౌళి తిప్పలు
By: Tupaki Desk | 23 Jun 2016 5:30 PM GMTబాహుబలికి పైసా ఖర్చు పెట్టకుండా ప్రమోషన్స్ చేసుకుని.. రాజమౌళి అండ్ టీం మంచి స్ట్రాటజీనే వర్కవుట్ చేసింది. ఆడియో రిలీజ్ ఫంక్షన్ నే కోటిన్నర వరకూ అమ్మారని బయట టాక్ ఉంది కానీ.. ఆ ఛానల్ నుంచి వీళ్లకు వచ్చిన మొత్తం 70లక్షలు అని ఇన్ సైడ్ టాక్. సోషల్ మీడియా నుంచి టీవీ మీడియా వరకూ బాహుబలి వార్త కనిపిస్తే తెగహంగామా చేశారు. ఈ హడావిడి బాహుబలి2 విషయంలో ఏ మాత్రం కనిపించక పోవడం.. జక్కన్న అండ్ టీంని కలవరపెడుతోంది.
అందుకే బాహుబలి టైంలో లోపల ఏం చేస్తున్నారో ఏ మాత్రం తెలియకుండా హంగామా చేస్తే.. ఇప్పుడు మాత్రం సెట్ లో వానొచ్చింది.. ప్యాకప్ చెప్పడానికి న్యాచురల్ స్టార్ వచ్చాడు.. ప్రియమణి వచ్చి కబుర్లు చెప్పింది.. ఈ టైపులో ట్విట్టర్ లో పోస్టులు పెట్టుకుంటున్నారు. ఇదంతా నిర్మాతల కోసం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న రికార్డుల కంటే ఎక్కువగా అమ్మినా.. పెట్టుబడితో పోల్చితే దక్కింది తక్కువే. ఇప్పుడు సెకండ్ పార్ట్ అమ్ముకోవడంతోనే లాభాలు చేసుకోవాల్సి ఉంది.
బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ కి ఇంకా 10 నెలల సమయం ఉన్నా.. రోజూ ఏదో ఒక హంగామాతో ఫ్రీగా పబ్లిసిటీగా పొందుదామనే ప్రయత్నం చేస్తోంది యూనిట్. కానీ ఈ సారి వాళ్లు ఆశించిన స్థాయిలో మార్కెటింగ్ జరగాలంటే.. పబ్లిసిటీ ప్రమోషన్స్ కోసం గట్టిగా ఖర్చుపెట్టక తప్పేట్లు లేదు.