Begin typing your search above and press return to search.

బాహుబలి ప్లాన్తే వేరయా!!!

By:  Tupaki Desk   |   11 Jun 2015 12:45 PM IST
బాహుబలి ప్లాన్తే వేరయా!!!
X
మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌.. అంటూ సూత్రీకరించాడు వెనకటికి ఒక హీరోగారు. ఇప్పుడు అదే తీరుగా అతిధుల్లేరు, పిలవడాలు అసలే లేవ్‌.. అంటున్నాడో డైరెక్టర్‌. ఆడియోకి అసలు రావాల్సిన పనేలేదు అంటున్నాడు రాజమౌళి. మూడేళ్లుగా ఎంతో శ్రమించి బాహుబలి చిత్రాన్ని ఉలి వేసి చెక్కాడు. చిత్రీకరణ పూర్తయింది.

ఇటీవలే ప్రచారం ఊపందుకుంది. బాహుబలి: ది బిగినింగ్‌ వచ్చే నెల 10న రిలీజ్‌కి రెడీ. అయితే ఈ శుక్రవారం సాయంత్రం అత్యంత ఘనంగా బాముబలి ఆడియో వేడును తిరుమలేశుని పాదాల చెంత ఘనంగా ఆవిష్కరిస్తున్నాడు. తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ ఆటస్థలంలో జరుగుతున్న ఈ ఆడియోకి ముఖ్య అతిధులు ఎవరినీ పిలవలేదు. కేవలం చిత్రయూనిట్‌ మాత్రమే వేదికపై సందడి చేస్తారు. రాజమౌళి, ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క, కె.రాఘవేంద్రరావు, శోభు తదితర యూనిట్‌ మాత్రమే కనిపిస్తారు. సెక్యూరిటీ కారణాల వల్ల, అలాగే తెలుగు ఆడియోతో పాటు తమిళ ఆడియోని ఒకే వేదికపై ఆవిష్కరించాలని అనుకోవడం వల్ల తిరుపతి అయితే సరైన సెంటర్‌ అని భావించి ఎంచుకున్నారు. ఆ మేరకు కె.రాఘవేంద్రరావు ఇచ్చిన సలహాల్ని రాజమౌళి అండ్‌ టీమ్‌ అనుసరిస్తున్నారు.

అయితే మరి హైదరాబాద్‌లో ప్రభాస్‌ అండ్‌ టీమ్‌ సందడి ఎప్పుడు? ఇక్కడ అభిమానుల పరిస్థితేంటి? అంటే దానికి కూడా మాష్టర్‌ప్లాన్‌ ఉంది. హైదరాబాద్‌లో త్వరలోనే ప్రచారపర్వానికి తెరలేవనుంది. ఇక్కడికి బాలీవుడ్‌ నుంచి కూడా సెలబ్రిటీల్ని రంగంలోకి దించి భారీ హైప్‌ తెస్తారని ప్రచారం సాగుతోంది. అది సంగతి.