Begin typing your search above and press return to search.
రాజమౌళి నంబర్-1 స్థానం పదిలం
By: Tupaki Desk | 30 Jun 2015 12:12 AM ISTఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి గురించే చర్చంతా. ఈ సినిమా రాజమౌళి కీర్తిని పదింతలు పెంచుతుందనే అంచనాలేస్తున్నారంతా. జూలై 10 రిలీజ్ తేదీ అని ప్రకటించారు. రిలీజ్‌కి సరిగ్గా 20రోజుల ముందే సెన్సార్ పూర్తి చేసి ప్రమోషన్ హడావుడిలో ఉన్నారంతా. అంతేకాదు సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమా చరిత్ర తిరగరాస్తుందనే అంటున్నారు. రాజమౌళి ఈ చిత్రంలో ఎమోషన్‌ని పీక్‌కి తీసుకెళ్లాడు.
యాక్షన్‌ని బ్లెండ్ చేసి తెరకెక్కించిన ఎమోషన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా ఉన్నాయని, ద్వితీయార్థంలో వచ్చే ఈ సీన్స్ విజువల్ ఫీస్ట్‌ని తలపిస్తాయని చెబుతున్నారు. రెండేళ్ల సుదీర్ఘ కాలం కాల్షీట్లు కేటాయించినందుకు ప్రభాస్‌కి సరైన ఫలితం దక్కనుంది. అతడిని బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని చూస్తారంతా. ఆ స్థాయిలో రాజమౌళి ప్రభాస్ పాత్రని ఎలివేట్ చేశారు. భీకరమైన పోరాటాల్లో యోధుడికి ఏమాత్రం తీసిపోకుండా ప్రభాస్ కనిపించాడు. అంతర్జాతీయ ప్రమాణాలున్న హీరోని చేశాడు. హాలీవుడ్‌లో రిలీజైన వార్ ఎపిక్ సినిమాలకు ఇది ఏమాత్రం తీసిపోదని చెబుతున్నారు. ఈ చిత్రంలో ఎప్పటిలాగే రాజమౌళి నంబర్-1 పొజిషన్ అలానే ఉంటుందని అంటున్నారు.