Begin typing your search above and press return to search.
ఇదేం అన్యాయం రాజమౌళి 1
By: Tupaki Desk | 14 Oct 2015 4:53 AM GMTప్రపంచంలో మరే వినియోగదారుడికి జరగనంత అన్యాయం సినీ ప్రేక్షకుడికి జరుగుతుందనటంలో సందేహం లేదు. మరే ఉత్పత్తి కొన్నా.. సేవను వినియోగించుకున్నా.. అసంతృప్తి చెందితే నష్టపరిహారం కోరటమో.. లేదంటే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మాత్రం అలాంటివేమీ ఉండవు.
సినీ ప్రేక్షకుడికి బాధ్యతలు మాత్రమే కానీ హక్కులు ఉండవు. ప్రేక్షక మహారాజు అని మాటకు చెబుతారే కానీ చేతల్లో అలాంటిదేమీ కనిపించదు. సినిమా ఇండస్ట్రీని బతికించాలని సినీ ప్రముఖులు తరచూ పిలుపునిస్తుంటారు కానీ.. సినిమా ప్రేక్షకుడి మనసును కష్టపెట్టకుండా తాము జాగ్రత్తగా ఉంటామని మాత్రం మాట వరసకైనా చెప్పరు.
మిగిలిన సంగతులన్నీ పక్కన పెట్టేద్దాం. బాహుబలి సినిమా వరకూ వస్తే.. భారతదేశ చరిత్రలో ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత కారణంగా.. తెలుగు సినీ ప్రేక్షకుడు ప్రతిఒక్కరూ తమకు తాముగా ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారి.. ఈ సినిమా గురించి తెగ చెప్పటం.. మాట్లాడుకోవటమే కాదు.. ఇలాంటి సినిమాను ఆదరించకుంటే.. కొత్త ప్రయోగానికి అవకాశమే ఉండదని ఫీలయ్యారు. అందుకే.. బాహుబలి సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయటమే కాదు.. దాని మీద అంచనాలు పెరిగలా చేయటమే కాదు.. ఇలాంటి సినిమాను థియేటర్ లోనే చూడాలన్న వాదనను బలంగా వినిపించినోళ్లు ఉన్నారు.
అందరి అంచనాలకు తగ్గట్లే.. భారతదేశ సినీ చరిత్రలో గుర్తుండిపోయేలా కొన్ని చిత్రాల్లో బాహుబలి ఒకటిగా చేశారు ప్రేక్షక దేవుళ్లు. బాహుబలి సినిమాను రెండు భాగాలుగా చెప్పిన ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి.. మొదటి భాగం విడుదల చేసే సందర్భంలోనూ.. రెండో భాగానికి సంబంధించి 40 శాతం వరకూ షూటింగ్ పూర్తి అయ్యిందని.. రెండో భాగం 2016లో రిలీజ్ చేస్తామని ఊరించారు.
బాహుబలి సినిమా విడుదల కావటం.. సంచలన విజయం సాధించటం జరిగిపోయాయి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న డౌట్ మొదలు.. రెండో భాగం ఎప్పుడు వస్తుందా? అన్న సమాచారం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న పరిస్థితి. భాగాలుగా వదిలే సినిమాల్లో చాలావరకూ మొదటి భాగానికి.. రెండో భాగానికి మధ్య పెద్ద లింకు లేకుండా ఉంటుంది. కొన్నింటిలో ఉన్నా.. అది చాలా పరిమితంగా ఉంటుంది. కానీ.. బాహుబలి మాత్రం దీనికి భిన్నం. మొదటి భాగం చూసిన వారు చాలా సందేహాలతో థియేటర్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి. మనసులో ఉన్న సందేహాలన్నీ తీరాలంటే రెండో భాగం తప్పనిసరిగా చూడాల్సిందే.
కానీ.. పరిస్థితి చూస్తుంటే.. బహుబలి రెండో భాగం ఎప్పటికి విడుదల అవుతుందో అర్థం కాని పరిస్థితి. మొదట్లో చెప్పినట్లుగా 2016లో విడుదలయ్యే అవకాశమే లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఒకవేళ విడుదలైనా ఏడాది చివర్లో ఏమైనా ఛాన్స్ ఉంటుందేమోనన్నది ఒక చిన్న ఆశ మాత్రమే. ఎందుకంటే.. ఈ చిత్రానికి సంబంధించిన లోకేషన్ల చిత్రీకరణ కోసం రామోజీ ఫిలిం సిటీలో స్థల సేకరణ కోసం వెళ్లినట్లు దర్శకుడు రాజమౌళి నిన్న (అక్టోబరు 13న) తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు.