Begin typing your search above and press return to search.
ధృవ టీంకి హ్యాట్యాఫ్ - రాజమౌళి
By: Tupaki Desk | 11 Dec 2016 5:41 PM GMTరామ్ చరణ్ మూవీ ధృవకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి.. ఇండస్ట్రీ జనాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి అయితే.. ధృవను ఓ రేంజ్ లో ప్రశంసించేశాడు.
'స్టోరీని ముందు ఉంచి ఇమేజ్ ను వెనక్కు నెట్టి ధృవ చిత్రాన్ని అద్భుతంగా ఇంట్రెస్టింగా తీర్చిదిద్దిన చరణ్.. సురేందర్ రెడ్డిలకు నా పూర్తి అభఇనందనలు. ప్రారంభం నుంచి చివరివరకూ చరణ్ ప్రతీ సన్నివేశంలోనూ ఫెంటాస్టిక్ ఫిజిక్ తో సూపర్బ్ గా కనిపించాడు. తన చురుకైన ఎక్స్ ప్రెషన్స్ తో మూవీ అంతా ఆకట్టుకున్నాడు. రకుల్ చాలా అందంగా ఉంది. అరవింద్ స్వామి ఇప్పటికే తమిళ్ లో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక్కడ తక్కువగా ఏమాత్రం అనిపించకుండా అధ్భుతంగా చేశాడు' అంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి.
'సినిమాకు సంబంధించి పూర్తి మార్కులు రైటర్ కే వేస్తున్నా. ఫ్యాబ్యులస్.. అతనే రియల్ హీరో' అంటూ రచయిత మోహన్ రాజాకు అభినందనలు తెలిపాడు రాజమౌళి. జక్కన్న నుంచి ఈ రేంజ్ లో ధృవకు రివ్యూ రావడంతో.. మెగా ఫ్యాన్స్ విపరీతంగా సంతోషించేస్తున్నారు. సెకండ్ డే నుంచి పుంజుకున్న ధృవ.. ఇండస్ట్రీ హిట్ మూవీస్ తో సమానంగా వసూళ్లు రాబడుతుండడం ఇండస్ట్రీ జనాలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.