Begin typing your search above and press return to search.

శాతకర్ణి లుక్.. లేటైపోయిందంటున్న రాజమౌళి

By:  Tupaki Desk   |   11 Jun 2016 6:25 AM GMT
శాతకర్ణి లుక్.. లేటైపోయిందంటున్న రాజమౌళి
X
ఓ పక్క ‘బాహుబలి: ది కంక్లూజన్’ పనుల్లో తీరిక లేకుండా గడుపుతూనే మధ్యలో ‘బాహుబలి: ది బిగినింగ్’ చైనా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. మధ్యలో ఢిల్లీ వెళ్లి ‘సీఎన్ ఎన్ ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకుని వచ్చాడు రాజమౌళి. ఎప్పుడో కాస్త ఖాళీ దొరికినపుడు తనకు నచ్చిన అంశాల మీద నాలుగు ట్వీట్లు వేసే జక్కన్న.. తప్పక స్పందించాల్సిన రెండు అంశాల గురించి ఈ రోజు ట్వీట్లు చేశాడు. అందులో ఒకటి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ లుక్ పోస్టర్. ఈ రోజు ఈ పోస్టర్ గురించి ఓ ట్వీట్ పెట్టాడు జక్కన్న. ‘‘ఈ పిక్ లేటుగా చూశా.. వావ్.. టెర్రిఫిక్..’’ అని ఇవాళ ఉదయం ట్వీట్ పెట్టాడు రాజమౌళి.

మరోవైపు తన గురువు కె.రాఘవేంద్రరావు కొత్తగా మొదలుపెట్టిన ‘క్లాస్ రూమ్’ గురించి కూడా జక్కన్న స్పందించాడు. 50 ఏళ్ల అనుభవాన్ని కొన్ని నిమిషాలకు కండెన్స్ చేశారని.. ప్రతి సినిమా ఔత్సాహికుడూ కచ్చితంగా ‘కేఆర్ ఆర్ క్లాస్ రూం’ వీడియోలు చూడాల్సిందేనని అభిప్రాయపడ్డాడు రాజమౌళి. ఈ సందర్భంగా ఒకప్పుడు రాఘవేంద్రరావు దగ్గర పని చేసిన అనుభవాల్ని కూడా జక్కన్న గుర్తు చేసుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నపుడు రాఘవేంద్రరావు సార్ సలహాలు చాలా అప్లై చేశానని.. తాను క్రాంతి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినపుడు చాలా బిడియంతో ఉండేవాడినని.. ఐతే రాఘవేంద్రరావు దగ్గరికి వచ్చాక చాలా యాక్టివ్ అయిపోయానని.. ఆయన వల్లే ‘స్టూడెంట్ నెంబర్ వన్’తో బ్రేక్ వచ్చిందని.. కాబట్టి అసిస్టెంట్ డైరెక్టర్లు యాక్టివ్ గా.. పరిశీలన దృష్టితో ఉండాలని సూచించాడు జక్కన్న.