Begin typing your search above and press return to search.
మధ్యలో రాజమౌళి ఇరుక్కున్నాడే..
By: Tupaki Desk | 13 Jan 2017 4:03 PM GMTస్క్రిప్టు రాయడంలో.. సినిమాలు తీయడంలో ఒక్కొక్కరిది ఒక్కో తరహా. పూరి జగన్నాథ్ లాంటి వాళ్లు వారంలో స్క్రిప్టు రాస్తారు. మూడు నెలల్లో సినిమాలు తీస్తారు. అలాగని అందరు దర్శకులూ అలాగే సినిమాలు చేయాలనేమీ లేదు. టాలీవుడ్ గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడైన ఎస్.ఎస్.రాజమౌళి తన ప్రతి సినిమాకూ చాలా సమయం తీసుకుంటాడు. మామూలు సినిమాలకు కూడా కనీసం ఏడాది కేటాయిస్తాడు. ఇక ‘బాహుబలి’ లాంటి సినిమాకు ఆయన ఏళ్లకు ఏళ్లు వెచ్చించడంపై ఎవరికీ ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఇప్పుడు క్రిష్ వచ్చి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి భారీ సినిమాను 79 రోజుల్లో తీసేసి.. మొత్తంగా ప్రారంభమైన ఎనిమిది నెలల్లో రిలీజ్ చేసేసరికి.. ఇప్పుడందరూ రాజమౌళిని టార్గెట్ చేసుకున్నారు.
‘బాహుబలి’ స్థాయిలో కాకపోయినా.. మంచి స్టాండర్డ్సే మెయింటైన్ చేశాడు. భారీతనానికి ఇందులోనూ ఢోకా లేదు. ఒకటికి మూడు యుద్ధాలున్నాయి ఇందులో. మరి ఆ సన్నివేశాలన్నింటిననీ క్వాలిటీ పరంగా రాజీ పడకుండానే క్రిష్ అంత వేగంగా పూర్తి చేసినపుడు.. రాజమౌళి మరీ అంత సమయం తీసుకోవడం ఏంటన్న చర్చ నడుస్తోందిపుడు. స్వయంగా రాజమౌళే క్రిష్ వేగం చూసి ఆశ్చర్యపోతూ.. తన దగ్గర్నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందంటూ ముందే సరెండర్ అయినప్పటికీ.. అతడిపై సెటైర్లు ఆగట్లేదు. క్వాలిటీ పేరుతో ఏళ్లకు ఏళ్లు సినిమాను చెక్కుతూ కూర్చోవడం కరెక్ట్ కాదని.. రాజమౌళి కూడా క్రిష్ లాగా వేగం అలవాటు చేసుకోవాలని సూచనలు ఇస్తున్నారు. మొత్తానికి తన తర్వాతి ప్రాజెక్టుల విషయంలో రాజమౌళి కొంచెం వేగం చూపించకుంటే విమర్శలు తప్పేలా లేవు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/