Begin typing your search above and press return to search.
'హంస వాన' మరో పచ్చబొట్టు అవుతుందా?
By: Tupaki Desk | 21 March 2017 11:03 AM GMTబాహుబలి ది కంక్లూజన్ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ చిన్న అప్‌డేట్ ఇప్పుడు వైరల్ గా స్ప్రెడ్ అవుతోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత బాహుబలి2 హంగామా బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడీ చిత్రంలోని పాటల జాబితా చూస్తే ఓ ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది.
బాహుబలి మొదటి భాగంలో అన్ని ఎలిమెంట్స్ ను రంగరించిన రాజమౌళి.. రెండో పార్ట్ విషయంలో సీరియస్ టోన్ మెయింటెయిన్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బాహుబలి2లో ఐదు పాటలు ఉండగా.. అందులో ఒక్కటే హీరో హీరోయిన్ల మధ్య సాగే డ్యూయెట్. మిగతావన్నీ సిట్యుయేషనల్ సాంగ్స్ మాత్రమే. హంసవాన అంటూ సాగే ఈ పాట.. అమరేంద్ర బాహుబలి-దేవసేనల మధ్య వస్తుందనే విషయం అర్ధం చేసుకోవచ్చు. అయితే.. తొలి భాగంలో తమన్నా ఓ రేంజ్ లో ఓవర్ ఎక్స్ పోజ్ చేసిన పాట 'పచ్చబొట్టేసినా' అంటూ సాగుతుంది. ఆ పాటలో తమ్ము తన అందాలను ఆరబోసేసింది.
ఇప్పుడీ హంసవాన సాంగ్ లో అనుష్క అందాలను రాజమౌళి ఏ స్థాయిలో ఆవిష్కరించనున్నాడో అనే ఆసక్తి కనిపిస్తోంది. మరోసారి పచ్చబొట్టేసిన స్థాయిలో ఈ హంసవాన పాటను చిత్రీకరిస్తే మాత్రం.. సినిమా హైలైట్ పాయింట్స్ లో ఇది కూడా ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బాహబలి ది కంక్లూజన్.. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా 4 భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/