Begin typing your search above and press return to search.

అక్టోబర్ 5 న్యూస్.. లీకైపోయిందోచ్!!

By:  Tupaki Desk   |   1 Oct 2016 11:34 AM GMT
అక్టోబర్ 5 న్యూస్.. లీకైపోయిందోచ్!!
X
ఆల్రెడీ మనం చెప్పేశాం కూడా. కాకపోతే దర్శకదిగ్గజం రాజమౌళి అక్టోబర్ 5న ఇచ్చేద్దాం అనుకున్న ఆ సర్పరైజ్ కూడా ఇదే అనే విషయం తెలిస్తే.. ఇప్పుడు మీరు కూడా షాకవుతారు. ఆల్రెడీ మేడం టుస్సాడ్ మ్యూజియం వారు కొత్తగా బ్యాంకాక్ లో తెరిచిన మైనపు విగ్రహాల మ్యూజియం గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఈ విగ్రహం మ్యాటరే రాజమౌళి చెప్పాలనుకున్న ఆ అక్టోబర్5 తాలూకు న్యూస్ తెలుసా?

అవును. అక్టోబర్ 5న విగ్రహం ఫోటోతోపాటు అఫీషియల్ గా ఈ మేడం టుస్సాడ్ విగ్రహం న్యూస్ ను రిలీజ్ చేయాలని బాహుబలి అండ్ టీమ్ భావించారు. కాని ఇంతలోనే టుస్సాడ్ మ్యూజియం వారే స్వయంగా ఫోటోలు తీసుకుని విగ్రహం రెడీ చేస్తున్నాం అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పేశారు. దానితో ఎలాగో సస్పెన్స్ ఓపెన్ అయిపోయింది అని తెలుసుకున్న రాజమౌళి.. ''నేను చెప్పాలనుకున్న న్యూస్ కూడా ఇదే. అసలు ఈరోజుల్లో ఏదన్నా న్యూస్ ను దాచుంచడం అనేది చాలా కష్టం సుమీ. ఇక మన సౌత్ ఇండియా నుండి ఆ మ్యూజియంలో విగ్రహం పెట్టబడిన తొలి సెలబ్రిటీ ప్రభాస్ కావడం మనకు గర్వకారణం'' అన్నాడు.

మార్చి 2017లో ఈ స్టాట్యూ (విగ్రహం) ప్రపంచ చూడ్డానికి వీలు పడుతుంది. ఇక ఒక్కసారి విగ్రహం రెడీ అవ్వగానే దానిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాలకు తిప్పేసి.. ఒక వరల్డ్ టూర్ వేయించి.. అప్పుడు బ్యాంకాక్ లో పర్మినెంట్ గా ఉంచేస్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/