Begin typing your search above and press return to search.
రాజమౌళికి అలాంటి సినిమాలంటే ఇష్టముండదట...!
By: Tupaki Desk | 18 April 2020 10:30 PM GMTదర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ లో భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ 'అల్లూరి సీతారామ రాజు' రోల్ పోసిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటీనటులతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ లుక్ మరియు రామ్ చరణ్ స్పెషల్ ఇంట్రో వీడియోలకు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకుంది.
అయితే తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన రాజమౌళి సినిమా విషయాలతో పాటు అనేక విషయాలు పంచుకున్నాడట. ఆర్ఆర్ఆర్ పనులతో పాటు కొత్త కథలపై వర్క్ చేస్తున్నానని.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ తో ఉంటుందని.. ఈ చిత్రాన్ని కేయల్ నారాయణ నిర్మిస్తారని చెప్పారట. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండగా వీటి నేపథ్యంలో సినిమాలు కూడా తెరకెక్కించేవారుంటారు.. హాలీవుడ్‌లో ఈ తరహా సినిమాలు వస్తూనే ఉంటాయని.. అయితే తనకు మాత్రం అలాంటివి నచ్చవని రాజమౌళి చెప్పుకొచ్చాడట. కరోనా సాయంపై స్పందించిన ఆయన 'మా కుటుంబం, స్నేహితుల బృందం ఏదో ఒక విపత్తు వచ్చినప్పుడే కాదు.. ఏడాది పొడవునా ఏదో సాయం చేస్తూనే ఉంటారని.. అయితే కొంతమంది మాత్రం చెప్పుకోవడానికి ఇష్టపడతారు.. కొందరు ఇష్టపడరని.. చెప్పుకోవడం తప్పేం కాదని.. చెప్పుకోనంత మాత్రాన చేయనట్టు కాదని చెప్పుకొచ్చాడట. ఏదేమైనా సూపర్ స్టార్ అభిమానులు మాత్రం జక్కన నిర్ణయంతో ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పవచ్చు. తమ అభిమాన హీరో దర్శకధీరుడితో సినిమా చేయాలని ఎన్నాళ్ళ నుండో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఈ న్యూస్ బూస్ట్ అప్ ఇచ్చిందని చెప్పవచ్చు.