Begin typing your search above and press return to search.

జక్కన్న ఉద్దేశ్యం అదేనా?

By:  Tupaki Desk   |   26 March 2020 2:30 AM GMT
జక్కన్న ఉద్దేశ్యం అదేనా?
X
ఒక సినిమాను ఎంత వరకూ ప్రమోట్ చేయాలనేది రాజమౌళి నుండి నేర్చుకోవాలి. అవును ప్రమోషన్స్ లో జక్కన్న ది మాస్టర్ మైండ్. ఓపినింగ్ నుండి రిలీజ్ వరకూ ప్రతీ రోజు మేకింగ్ కి ఎలా ఆలోచిస్తాడో ప్రమోషన్స్ విషయంలోనూ అంతే ఆలోచిస్తాడు రాజమౌళి. అందుకే జక్కన్న ప్రమోషన్ ప్లాన్ కి ఎవరైనా ఫిదా అవుతారు. 'బాహుబలి' ఫ్రాంచైజీ ను ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్ లో ప్రమోట్ చేసి ఎవరూ అందుకోలేని ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' విషయంలోనూ అదే ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. ఇంత వరకూ పూర్తి టైటిల్ ప్రకటించని రాజమౌళి దీనికోసం ఉగాదిను ఎంచుకున్నాడు. ఉగాది సందర్భంగా ఈ రోజు 'ఆర్ ఆర్ ఆర్' పూర్తి టైటిల్ తో ఓ మోషన్ పోస్టర్ ను యూ ట్యూబ్ లో వదిలాడు. అయితే దీని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉంది.

అవును ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల జనాలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అందరూ తన సినిమా గురించే మాట్లాడుకునేలా ప్లాన్ చేసాడు. అంతే కాదు జనాలు కాలిగా ఉండటం ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఉండే రోజులు కాబట్టి యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ వస్తాయని గమనించి రాత్రికి రాత్రి అనౌన్స్ చేసి అన్నీ సెట్ చేసాడు. మోషన్ పోస్టర్ అందరినీ ఇంప్రెస్ చేయడం పక్కా కాబట్టి ఎక్కువ మంది చూసే అవకాశం ఉందని ఊహించాడు. సో మోషన్ పోస్టర్ తోనే రికార్డులు మొదలెట్టాలని భావించాడన్నమాట. ఏదేమైనా జక్కన్న మైండే మైండు.