Begin typing your search above and press return to search.

బాహుబలి2లో భారీ విగ్రహం ఎవరిదో

By:  Tupaki Desk   |   8 Jun 2016 1:30 PM GMT
బాహుబలి2లో భారీ విగ్రహం ఎవరిదో
X
దర్శకధీరుడు రాజమౌళి సినిమాలంటే భారీతనంతో నిండి ఉంటాయి. విజువల్స్ పరంగానే కాదు.. ఎమోషన్స్ పరంగా కూడా కూడా పీక్స్ కి తీసుకెళ్లిపోవడం రాజమౌళి మార్క్ మేకింగ్ అండ్ టేకింగ్. బాహుబలిలో ఈ గ్రాండ్ నెస్ టాప్ రేంజ్ కి చేరిపోయింది. అన్నిటికంటే మించి.. భల్లాలదేవుడి విగ్రహం - సినిమాలో ఆ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తాయి. మరి బాహుబలి2లో ఇంతకు మించి భారీతనం కనిపిస్తుందని ఈజీగానే ఎక్స్ పెక్ట్ చేయచ్చు.

ఇప్పుడందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. బాహుబలి ది కంక్లూజన్ చిత్రం కోసం క్లైమాక్స్ కి సంబంధించిన ఎపిసోడ్ చిత్రీకరణ త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. ఈ మేరకు ప్రభాస్ - రానా - అనుష్క - తమన్నా సహా ప్రధాన పాత్రధారులంతా సిద్ధమైపోతున్నారు. మరోవైపు ఓ భారీ విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. మొదటి భాగంలో భల్లాలదేవుడి విగ్రహాన్ని చూపించిన రాజమౌళి.. ఈ సారి ఎవరి స్టాట్యూని చూపిస్తాడో అని అనుకుంటున్నారు. ఇది బాహుబలి విగ్రహమే అయి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

అయితే.. ఇది విగ్రహం కోసం కాదని.. క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరణ కోసం భారీ సెట్ నిర్మాణం జరుగుతోందనే టాక్ కూడా వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం.. జక్కన్న చెబితే మాత్రమే ఉంటుంది. కొన్ని విషయాలు ఆయన చెప్పడు.. బైటకు తెలీవు. ఏమైనా అడిగితే సినిమాలో చూసుకోమనే సమాధానం మాత్రమే వస్తుంది. అందుకే ఇప్పటికైతే మేకింగ్ అప్ డేట్స్ తో సరిపెట్టుకోవడమే.