Begin typing your search above and press return to search.

బాహుబ‌లికే తోపులాంటి ఎటెంప్ట్?

By:  Tupaki Desk   |   4 Sep 2019 5:26 AM GMT
బాహుబ‌లికే తోపులాంటి ఎటెంప్ట్?
X
దాదాపు 1000 కోట్ల బ‌డ్జెట్ తో `మ‌హాభార‌తం` సిరీస్ ని ఐదు భాగాలుగా తెర‌కెక్కిస్తాన‌ని అన్నారు మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్. అందుకోసం రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంబానీలే త‌లుచుకుంటే ఇంకేముందిలే.. అనుకున్నారంతా. కానీ ఆ త‌ర్వాత ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ వెన‌క‌డుగు వేయాల్సొచ్చింది. అధునాత‌న‌ భార‌త‌దేశంలో రాజకీయ కార‌ణాలు.. మ‌త‌ప‌ర‌మైన చిక్కుల గురించి డీప్ గా ఆలోచించిన అమీర్ పూర్తిగా వెన‌క్కి త‌గ్గారు. దాంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అతడి ఫాలోవ‌ర్స్ తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. అయితే బాహుబ‌లి ఫ్రాంఛైజీలో రెండు భాగాలు పూర్త‌య్యే క్ర‌మంలో ఎస్.ఎస్.రాజ‌మౌళి అత్యంత భారీ బ‌డ్జెట్ తో `మ‌హాభార‌తం` తెర‌కెక్కిస్తార‌ని ప్ర‌చార‌మైంది. కానీ అమీర్ ఖాన్ లాంటి దిగ్గ‌జం ఇలాంటి ఆలోచ‌న‌లు చేస్తుండ‌డంతో ఆయ‌న వెన‌క్కి త‌గ్గారు. ఒక ర‌కంగా రాజమౌళి మ‌హాభార‌తం అన్న టాపిక్ బ‌య‌ట‌కు రాగానే అమీర్ ఖాన్ మ‌హాభార‌తం ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డం అప్ప‌ట్లో తెలుగు ఫిలింక్రిటిక్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. జ‌క్క‌న్న టేకోవ‌ర్ చేసేస్తున్నార‌నే భ‌యంతోనే బాలీవుడ్ వ‌ర్గాలు ఈ ప్ర‌క‌ట‌న చేశాయా? అని ముచ్చ‌టించుకున్నారు.

అదంతా స‌రే.. ఇప్పుడే ప్ర‌త్యేకించి జ‌క్క‌న్న `మ‌హాభార‌తం` గురించి మాట్లాడాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏమిటి? అంటే దానికి ప్ర‌త్యేక కార‌ణం ఉంది. ఎస్.ఎస్.రాజ‌మౌళి మైండ్ లో ప్ర‌స్తుతం మ‌హాభార‌తం ఆలోచ‌న ఎగ్జిట్ అయిపోయిందా? అన్న సందేహాలు అభిమానుల‌కు ఉంది. దానికి స‌మాధానం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో రాజ‌మౌళి చేయ‌బోయే ప్రాజెక్ట్ ఏది? అన్న‌ది రివీల్ కావాల్సి ఉంది. మ‌హేష్ తో జ‌క్క‌న్న‌కు క‌మిట్ మెంట్ ఉంది. సేమ్ టైమ్ మ‌హాభార‌తం చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు రైట్ టైమ్ ఇదేన‌ని.. మ‌హేష్ ని భాగ‌స్వామిని చేయ‌డం రైట్ ఛాయిస్ అని భావిస్తున్నార‌ట‌. మ‌హాభార‌తం తెర‌కెక్కిస్తే అందులో మ‌హేష్ కి న‌చ్చిన పాత్ర‌లో అవ‌కాశం ఇస్తారు. అలాగే అన్ని భాష‌ల నుంచి స్టార్లను ఇంపార్టెంట్ పాత్ర‌ల‌కు ఎంపిక చేసుకుంటారు. బాలీవుడ్ కురువృద్ధుడు అమితాబ్ బ‌చ్చ‌న్ ఇందులో భీష్ముడిగా న‌టించే వీలుంటుంద‌ని తెలుస్తోంది. రాజ‌మౌళి పిల‌వాలే కానీ ... ఆయ‌న ఖాతాలో ప్ర‌భాస్-రానా- సుదీప్- విజ‌య్ సేతుప‌తి- నాని- నాగార్జున‌ -ర‌వితేజ వీళ్లంతా ఎలానూ ఉండ‌నే ఉన్నారు.

500 కోట్లు అంత‌కుమించిన బ‌డ్జెట్ తో అల్లు అర‌వింద్ `రామాయ‌ణం` తెర‌కెక్కిస్తున్న ఈ టైమ్ లో రాజ‌మౌళి `మ‌హాభార‌తం` తీయ‌క‌పోతే అది నామోషీ కిందే లెక్క‌. పోటీ ప్ర‌పంచంలో రాజ‌మౌళి ఏ కోణంలోనూ వెన‌క్కి త‌గ్గే ప్ర‌సక్తి లేదు. అందువ‌ల్ల ఆర్.ఆర్.ఆర్ పూర్త‌య్యే క్ర‌మంలో `మ‌హాభార‌తం` ప్ర‌క‌ట‌న ఉంటుంద‌నే అభిమానులు ఆశిస్తున్నారు. బాలీవుడ్ వాళ్ల మైండ్ లో మ‌రోసారి మ‌హాభార‌తం పురుగు తొలిచేయ‌క ముందే ఆ ఫార్ములాని జ‌క్క‌న్న ఒడిసిప‌డ‌తాడ‌నే భావిస్తున్నారంతా. `మ‌హాభార‌తం 3డి` సినిమాల్ని ఒక సిరీస్ గా చూడాల‌న్న ఉత్సాహం ప్ర‌పంచ‌వ్యాప్తంగా కేవ‌లం భార‌తీయుల‌కే కాదు వ‌ర‌ల్డ్ ఆడియెన్ కి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో యూనివ‌ర్శ‌ల్ ఫార్ములా అంటే అది మ‌హాభార‌తం-రామాయ‌ణం క‌థ‌లు మాత్ర‌మేన‌న‌డంలో ఎలాంటి సందేహాలు లేవు. హాలీవుడ్ కొలాబ‌రేష‌న్ తోనూ ఈ ఫ్రాంఛైజీల్ని ఎన్ లార్జ్ చేసే వీలుంటుంది. అందుకు కార్పొరెట్ దిగ్గ‌జాల జాయింట్ వెంచ‌ర్ల స‌హ‌కారం ఉంటుంది కాబ‌ట్టి ఆ ప్ర‌య‌త్నం చేయ‌డం త‌ప్పే కాదు.