Begin typing your search above and press return to search.
ఒకే షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేస్తాం: స్టార్ డైరెక్టర్
By: Tupaki Desk | 1 Jun 2020 2:30 PM GMTదర్శక ధీరుడు రాజమౌళి తను తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ పై స్పందించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా షూటింగు నిలిచిపోయింది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎవరికీ తెలీదని అందరూ టెన్షన్ పడుతుండగా.. తాజాగా ఓ తియ్యని కబురు చెప్పాడు రాజమౌళి.
ఇక వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ జీవనం నెట్టుకెళ్లాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సడలింపులలో భాగంగా కొన్ని రాష్ట్రాలు సినిమా షూటింగులకు సైతం పర్మిషన్ ఇచ్చాయి. త్వరలోనే టాలీవుడ్ లో కూడా కరోనా హెల్త్ గైడ్‌లైన్స్ పాటిస్తూ జూన్ నుండి షూటింగ్ జరుపుకునేలా ఉత్తర్వులు రానున్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 8న విడుదల చేస్తామని రాజమౌళి టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం.. సినిమా షూటింగ్ 70% పూర్తయిందని.. మిగిలిన 30% షూటింగ్ జూన్ లేదా జూలై నాటికి పూర్తి చేస్తామని ఇదివరకే తెలిపారు.
ఇక షూటింగ్ ప్రారంభం అయితే.. ఆర్ఆర్ఆర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు.. ప్రచారాలకు తగిన టైమ్ లభిస్తుందని తెలిపాడు రాజమౌళి. అంతేగాక ఈ వారంలోనే పలు తెలుగు సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్లాయి. ఇక తను తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక సినిమా ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఈ వారంలో సెట్స్ పైకి తీసుకెళ్తామని అన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందట మూవీ టీమ్. అయితే మిగిలిన 30% షూటింగ్ మొత్తం ఒకే షెడ్యూల్ లో ముగించాలని రాజమౌళి ప్లాన్. భారీ హంగులకు వెళ్లకుండా.. తక్కువ క్రూతో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోనే షూటింగ్ చేస్తారని సమాచారం. చూడాలి మరి జక్కన్న అన్నట్లుగా ఒకే షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేస్తాడేమో..!