Begin typing your search above and press return to search.
ఆ హిందీ హీరో పై జక్కన్న కన్ను!
By: Tupaki Desk | 21 Nov 2018 9:17 AM GMTఇప్పుడు టాలీవుడ్లోనే కాకుండా ఇండియాలో మొత్తంమీద తెరకెకుతున్న క్రేజీ సినిమాల్లో రాజమౌళి #RRR ఒకటి. ఈ సినిమాలో తారక్.. చరణ్ లు తప్ప మిగతా పాత్రల్లో ఎవరు చేస్తున్నారనే విషయంలో ఇంతవరకూ ఇన్ ఫర్మేషన్ లేదు. రాజమౌళి గత చిత్రాల తరహాలోనే ఈ సినిమాకు ఇతర భాషలకు చెందిన కొందరు నటులను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట.
ఇక హిందీ మార్కెట్ కోసం ఒక బాలీవుడ్ స్టార్ ను తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడట. నార్త్ ఆడియన్స్ కు ఇది తమ సినిమాలాగా అనిపించాలంటే ఒక బాలీవుడ్ స్టార్ ఉండాలని అప్పుడే ఈ సినిమాకు ప్యాన్ ఇండియా అప్పీల్ వస్తుందని భావిస్తున్నాడట. ఇందుకోసం అజయ్ దేవగణ్ పేరును పరిశీలిస్తున్నారని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అజయ్ గతంలో సౌత్ సినిమాల రీమేకుల్లో నటించాడు. పైగా అమరావతిలో ఒక ఫిలిం స్టూడియో నెలకొల్పే ప్రయత్నాలో ఏపీ ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఆయన చాలా రోజుల నుండి తెలుగు ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తున్నాడని దీంతో ఆయన ఈ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేయడని అనుకుంటున్నారట.
కానీ అజయ్ దేవగణ్ ను #RRR లో ఏ పాత్రకు తీసుకుంటారు అనే విషయం ఇంకా బయటకు రాలేదు. ఏదేమైనా రాజమౌళి 'బాహుబలి' ఇంపాక్ట్ బాలీవుడ్ అందరికీ తెలుసు కాబట్టి అయన సినిమాలో నటించేదుకు అభ్యంతరం ఉండక పోవచ్చు. అంతా సవ్యంగా జరిగితే.. మూడు ఆర్ లకు ఒక ఎ తోడవుతుందన్నమాట...!