Begin typing your search above and press return to search.

జక్కన్న టెన్నిస్ ఆడుతూ కూడా అంతేనట..

By:  Tupaki Desk   |   7 Nov 2015 9:51 AM GMT
జక్కన్న టెన్నిస్ ఆడుతూ కూడా అంతేనట..
X
రాజమౌళి డైరెక్టర్ గానే మనకు పరిచయం. కానీ ఆయనలో మనకు తెలియని చాలా యాంగిళ్లు ఉన్నాయి. ఖాళీ దొరికినపుడు ఆయన లోక్ సత్తా కార్యకలాపాల్లో, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటాడని తెలిసింది తక్కువమందికే. మరోవైపు జక్కన్న ఇష్టాఇష్టాల గురించి కూడా పెద్దగా బయటికి తెలియదు. ఆయనకు టెన్నిస్ అంటే చాలా ఇష్టమని.. ఏమాత్రం ఖాళీ దొరికినా ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్బుకెళ్లి గంటల తరబడి టెన్నిస్ ఆడతాడని సన్నిహితులకే తెలుసు.

బాహుబలి మొదలవడానికి ముందు రెగ్యులర్ గా టెన్నిస్ ఆడేవాడు జక్కన్న. ఐతే ఆ సినిమా షూటింగులో ఉండగా.. సినిమా విడుదలైనపుడు.. ఆ తర్వాత కొన్ని నెలలు తనకెంతో ఇష్టమైన ఆటకు దూరంగా ఉన్నాడు జక్కన్న. మళ్లీ కొన్నాళ్లు ఫిలిం నగర్ క్లబ్బుకి రెగ్యులర్ గా వచ్చిన జక్కన్న.. బాహుబలి-2 పనులు మొదలయ్యాక దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఐదారు రోజులుగా క్రమం తప్పకుండా కోర్టుకు వస్తున్నాడని అక్కడి వాళ్లు చెబుతున్నారు. ఇంకో వారం పది రోజులు ఆటాడి.. ఆ తర్వాత ‘బాహుబలి-2’కి అంకితమైపోతాడట.

ఐతే జక్కన్న ఆడుతుండగా దగ్గరగా చూసిన వాళ్లు చెప్పేదేంటంటే.. ఈ దర్శక ధీరుడికి ఓటమి అంటే అస్సలిష్టం ఉండదట. ఓడిపోయే సందర్భాలు వచ్చినపుడు, ఓడిపోయాక రచ్చ రచ్చ చేస్తాడట. ఓడిపోతున్న సమయంలో చాలా ఫ్రస్టేట్ అవుతాడని.. ఐతే సినిమాల్లో గెలవడం అన్నది జక్కన్న చేతిలోనే ఉంటుంది. అక్కడ ఆడేది, ఆడించేది తనే. ఆటల్లో అలా ఉండదు. గెలుపోటములన్నవి పూర్తిగా మన చేతుల్లో ఉండవు. విజయావకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటాయి. ఎందుకంటే అవతల ఇంకో ఆటగాడుంటాడు. అందుకే వేరేవాళ్లలో ముడిపడిన వ్యవహారాల్లో ఓటమికి కూడా రెడీగా ఉండాలి. సినిమాల్లోలాగే ఇక్కడా విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేయాలంటే కష్టం కదా జక్కన్నా!