Begin typing your search above and press return to search.

బాహుబలి.. ప్రభాస్, జక్కన్న లెక్కలు ఇవే

By:  Tupaki Desk   |   11 Dec 2015 7:35 AM GMT
బాహుబలి.. ప్రభాస్, జక్కన్న లెక్కలు ఇవే
X
ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సృష్టించిన ప్రభంజనాలు లెక్క పెట్టాలంటే పుస్తకాలు రాసేయాలి. అనేక రికార్డులు సృష్టించి హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - దర్శకధీరుడు రాజమౌళిలను అనేక మెట్లు ఎక్కించింది బాహుబలి. ఇప్పుడు వీరిద్దరి మరో అరుదైన గౌరవం కూడా సంపాదించిపెట్టడం విశేషం.

ఫోర్బ్స్ జాబితాలో ప్రభాస్ - రాజమౌళి తొలిసారిగా స్థానం సంపాదించారు. 2015కు సంబంధించి టాప్ 100 సెలబ్రిటీ లిస్ట్ ను ఫోర్బ్స్ ఇండియా రిలీజ్ చేసింది. దీనిలో మొదటిసారి ప్లేస్ దక్కించుకున్నారు వీరిద్దరూ. ఈ ఏడాదికి గాను సంపాదన పరంగా రాజమౌళి రూ. 26 కోట్లతో.. 72వ స్థానంలో ఉన్నాడు. రెబెల్ స్టార్ ప్రభాస్ రూ. 24 కోట్లతో 77వ ప్లేస్ లో నిలిచాడు. రాజమౌళికి పారితోషికం విషయంలో చూసుకుంటే 30 ర్యాంకు, ఖ్యాతి పరంగా 84 వ ర్యాంకు దక్కాయి. బాహుబలి ప్రభాస్ కు రెమ్యూనరేషన్ విషయంలో 33వ స్థానం దక్కగా, ఫేమ్ విషయంలో 88 ప్లేస్ లో నిలిచాడు.

రాజమౌళి అయితే కేవలం బాహుబలి కోసమే ఈ మొత్తాన్ని అందుకున్నాడు. ప్రభాస్ కి దక్కన రెమ్యూనరేషన్ మాత్రం మహీంద్రా సంస్థకు బ్రాండ్ అండార్స్ మెంట్ తో కలిపి లెక్కపెట్టారు.