Begin typing your search above and press return to search.
సచిన్, ధోనీలపై రాజమౌళి హాట్ కామెంట్స్!
By: Tupaki Desk | 24 Sep 2016 12:45 PM GMTమహేంధ్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన "ఎంఎస్. ధోనీ" చిత్రాన్ని హిందీ పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లోని జే.ఆర్.సి కన్వెషన్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన దర్శక ధీరుడు రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధోనీని ఒక కర్మయోగికి అభివర్ణించిన రాజమౌళి.. తనదైన శైలిలో ధోనీపై ప్రసంశల వర్షం కురిపించారు.
"2011లో క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో క్రికెట్ గాడ్ గా పిలుచుకునే సచిన్ తన భావోద్వేగాలను అణచుకోలేకపోయారు కానీ.. మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఎలాంటి భావోద్వేగాలు లేకుండా నిల్చున్నారు. అందుకే నా దృష్టిలో ధోనీ ఒక కర్మయోగి. ఇంతకన్నా గొప్ప కర్మయోగిని మనం చూస్తామా?" అని ధోనీని ఆకాశానికెత్తారు దర్శక దిగ్గజం రాజమౌళి. సాధారణ రైల్వే ఉద్యోగి మహేంద్ర సింగ్ ధోనీ - ఒక కర్మయోగిగా ఎలా మారాడు అనే విషయాలు నీరజ్ పాండే మనకు సినిమా రూపంలో చూపించారని.. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందకు ఎంతగానో ఎదురు చూస్తున్నానని రాజమౌళి తెలిపారు.
ఈ సందర్భంగా మరింతగా ధోనీపై మాట్లాడిన రాజమౌళి... "గవాస్కర్, కపిల్ దేవ్ లాంటి ఎంతో మంది దిగ్గజాలు ఆడుతున్న సమయంలో కూడా మ్యాచ్ గెలుస్తామా? ఓడుతామా? అని భయం ఉండేది.. కానీ ధోనీ కెప్టెన్ అయ్యాక ఆ భయం లేకుండా పోయింది.. అలాంటి ఫీల్ అభిమానుల్లో ధోనీ కల్పించారు. 1983 ప్రపంచ కప్ అనంతరం చాలా గ్యాప్ తర్వాత ధోనీ సారథ్యంలోనే 2011లో భారతీయుల కల సాకారం అయింది. కేవలం నీ పని నీవు చేయి ఫలితం ఆశించకు అని భగవద్గీతలో ఓ స్లోకం ఉంటుంది. ప్రపంచ కప్ గెలిచాక 130 కోట్ల మంది భారతీయులంతా సంబరాల్లో మునిగిపోయారు కానీ ధోనీ మాత్రం కప్ ను అందుకుని దానిని సహచరులకు అందించి, తను మాత్రం పక్కకు వెళ్లి నిలబడ్డాడు. అందుకే మరోసారి చెబుతున్నారు ఆయన కర్మ యోగి" అని ప్రసంశల జల్లులు కురిపించారు.