Begin typing your search above and press return to search.
పెళ్లిచూపులు టీంకి రాజమౌళి బూస్ట్
By: Tupaki Desk | 1 Aug 2016 5:50 AM GMTచిన్న సినిమాగా మొదలై పెద్ద రేంజికి వెళ్లేలా ఉంది ‘పెళ్లిచూపులు’. విడుదలకు ముందే విమర్శకులు, సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాపై రిలీజ్ తర్వాత మరింతగా ప్రశంసల జల్లు కురుస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి సహా ఎంతో మంది ఈ సినిమాను కొనియాడుతున్నారు. నిన్న - ఆదివారం సాయంత్రం ‘పెళ్లిచూపులు’ సినిమా చూసిన రాజమౌళి.. ఈ సినిమాను. ఈ సినిమా టీంను ఆకాశానికెత్తేస్తూ ట్విట్టర్లో మెసేజ్ లు పెట్టాడు.
‘‘పెళ్లిచూపులు సినిమాను ఎంతో ఆస్వాదించాను. ఈ సినిమాలోని అందమైన అనుభూతుల్ని గుర్తు చేసుకుంటూ ఇంకా ఆ మూడ్‌లోనే ఉన్నాను. రచన.. దర్శకత్వం - నటీనటుల అభినయం.. సినిమాలో అన్నీ కూడా ఎంగేజింగ్ గా ఉన్నాయి. వెల్ డన్ తరుణ్ భాస్కర్. ఇది గొప్ప తొలి ప్రయత్నం. హీరో హీరోయిన్లిద్దరూ చూడ్డానికి చాలా తాజాగా ఉన్నారు. హీరో స్నేహితులుగా నటించినవాళ్లు కూడా చాలా బాగా చేశారు. నువ్వేం చేస్తున్నావ్ అని ఎదురయ్యే ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడేవాళ్లందరికీ ఈ సినిమాతో ఒక మంచి వన్ లైనర్ దొరికింది. పెళ్లిచూపులు టీం మొత్తానికి కంగ్రాట్స్. నాకు ఆదివారం చక్కటి వినోదాన్ని అందించినందుకు థ్యాంక్స్. ఈ సినిమాను మరిన్ని స్క్రీన్లలో ప్రదర్శించాలని కోరుకుంటున్నా. అలా జరగాలి కూడా’’ అని రాజమౌళి వరుస ట్వీట్లు గుప్పించాడు. మరోవైపు రాజమౌళితో పాటే సినిమా చూసిన సంగీత దర్శకుడు కీరవాణి సైతం ‘పెళ్లిచూపులు’పై ప్రశంసలు కురిపించాడు.