Begin typing your search above and press return to search.
రానా రెమ్యూనరేషన్ పెంచాల్సిందే మరి
By: Tupaki Desk | 23 Jun 2015 9:50 AM GMTతన ప్రతి సినిమాలోనూ హీరో కంటే విలన్ బలంగా, పొడవుగా, భారీగా ఉండాలని కోరుకుంటానని.. 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ కన్నా భారీగా ఉండే విలన్‌గా ఎవర్ని ఎంచుకోవాలని ఆలోచించినపుడు తనకు మన ఇండస్ట్రీలో రానా దగ్గుబాటి తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదని ఆడియో ఫంక్షన్‌లో చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఐతే రానాను సెలక్ట్ చేయడానికి అతడి ఒడ్డూ పొడుగు మాత్రమే కారణమయ్యాయని అనుకుంటే పొరబాటే. రాజమౌళి ఏం చేసినా ఓ లెక్క ఉంటుంది. ఇప్పుడు బాహుబలి సినిమాకు రానా వల్ల కలుగుతున్న లాభం చూస్తే.. రాజమౌళి చాలా లెక్కలు వేసుకునే రానాను భల్లాలదేవుడి క్యారెక్టర్‌కు సెలక్ట్ చేశాడని అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం బాహుబలి హిందీలో కరణ్ జోహార్ చేతుల మీదుగా భారీ స్థాయిలో విడుదలవుతోందంటే అందుక్కారణం రానానే అని రాజమౌళి స్వయంగా చెప్పాడు. కరణ్‌తో తనకున్న స్నేహంతో ఈ సినిమాను ఆయనకు పరిచయం చేసి.. విడుదల చేయించేలా చొరవ తీసుకున్నాడని జక్కన్న తెలిపాడు. ఇక కోలీవుడ్‌లోనూ రానా పరిచయాలు తక్కువేమీ కాదు. అక్కడి జనాల్లోకి కూడా 'బాహుబలి'ని తీసుకెళ్లడంలో రానా కీలక పాత్ర పోషించాడు. కొడుక్కి గొప్ప పేరు తెచ్చే సినిమా అవుతుంది కాబట్టి సురేష్ బాబు కూడా తెర వెనుక ఉండి 'బాహుబలి'కి అన్ని ఇండస్ట్రీలు స్వాగతం పలికేలా చూస్తున్నారని రానా సన్నిహితులు చెబుతున్నారు. ఈ మధ్య అమితాబ్ బచ్చన్‌కు కూడా 'బాహుబలి' సినిమా ట్రైలర్ దగ్గరుండి చూపించి.. ఆయనతో సినిమాను ప్రమోట్ చేయించింది కూడా రానానే. అందుకే జక్కన్నే స్వయంగా తమ సినిమా పబ్లిసిటీకి రానా 'మౌత్ పీస్' లాంటోడని చెప్పాడు.
రానా 'బాహుబలి'ని ప్రమోట్ చేస్తున్న తీరు చూసి ఓ అభిమాని ట్విట్టర్లో.. అతడికి పారితోషకం పెంచాలని ట్వీట్ చేయగా.. నిర్మాత శోభును ఉద్దేశించి 'ఈ ట్వీట్ చూశారా' అని రానా గిచ్చాడు. అందరితో దగ్గరుండి ఇలా డిమాండ్లు చేయిస్తున్నావా అని శోభు చమత్కరించాడు. ఆ అభిమాని అన్నట్లు 'బాహుబలి'కి రానా చేస్తున్న సాయం ప్రకారం అతడికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా తక్కువే.