Begin typing your search above and press return to search.
మరీ ఆ రేంజిలో చెప్పావేంటి జక్కన్నా!
By: Tupaki Desk | 9 March 2017 8:04 AM GMT‘బాహుబలి: ది కంక్లూజన్’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారతీయ సినీ చరిత్రలోనే ఏ సినిమా కోసం ఎదురు చూడనంతగా కోట్లాది మంది ఈ సినిమా కోసం ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. అసలే ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటిపోతుంటే.. దీని గురించి ఒక్కొక్కరు చెబుతున్న మాటలు ఆ అంచనాల్ని మరింత పెంచేస్తున్నాయి. మొన్ననే ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ చూసి గుండెలు అదిరిపోయినాయంటూ కీరవాణి తమ్ముడు కళ్యాణ రమణ ట్వీట్ పెట్టి అందరిలో ఆసక్తిని పెంచగా.. స్వయంగా ఇప్పుడు రాజమౌళి తన సినిమా గురించి ఓ రేంజిలో చెప్పేస్తున్నాడు.
ఇటీవలే బాలీవుడ్ ఫిలిం జర్నలిస్టు అనుపమ చోప్రా.. బాహుబలి సెట్లో రాజమౌళిని కలిసి ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘బాహుబలి-1’తో పోల్చి ‘బాహుబలి-2’ గురించి రాజమౌళి అన్న మాటలు అభిమానుల హర్ట్ బీట్ ను పెంచేశాయి. ‘బాహుబలి: ది బిగినింగ్’ జస్ట్ స్టార్టర్ లాంటిదని.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ విందు భోజనం లాంటిదని వ్యాఖ్యానించాడు రాజమౌళి. ‘ది బిగినింగ్’లో భారీ తనానికే భారతీయ ప్రేక్షకులకు మతి పోయింది. ఇప్పుడు దాంతో పోలిస్తే ఇది ఇంకా భారీగా.. గొప్పగా ఉంటుందని రాజమౌళి అంటున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ల గురించి ‘ఫాదర్ ఆఫ్ ఆల్ ఫైట్స్’ అంటూ రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే.
కథ పరంగా చూసినా.. ‘ది బిగినింగ్’లో పెద్దగా చెప్పిందేమీ లేదని.. పాత్రల్ని మాత్రమే పరిచయం చేసి.. కొంత కథను చూపించామని.. ‘ది కంక్లూజన్’లోనే అసలు కథంతా ఉంటుందని.. బాహుబలి-భల్లాలదేవ మధ్య పోరాటం చాలా గొప్పగా ఉంటుందని.. ఇలా రెండో భాగం మీద అంచనాల్ని మరింత పెంచే మాటలే చెబుతున్నాడు జక్కన్న. మామూలుగా ‘ది కంక్లూజన్’ మీద ఉన్న భారీ అంచనాలకు ప్రెజర్ ఫీలయ్యే కొంచెం హైప్ తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో అనుకుంటే.. ఆ హైప్ ను మరింత పెంచేలాగే రాజమౌళి మాట్లాడుతుండటం ఆశ్చర్యమే. ఈ హైప్ ను క్యాష్ చేసుకుందామని అలా మాట్లాడుతున్నాడా లేక తన ప్రాజెక్టుపై జక్కన్నకు అంత కాన్ఫిడెన్స్ ఉందా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/