Begin typing your search above and press return to search.
కెనడా వెళ్ళలేదని రాజమౌళి తిట్టేవాడట
By: Tupaki Desk | 10 Aug 2016 9:20 AM GMTరోజూ తన వైఫ్ రమా.. తన చేతిలో ఒక విషయంలో మాతం్ర కాస్త తిట్లు తింటూ ఉండేదని.. ఆమెను అలా టీజ్ చేస్తూ ఉండేవాడినని.. కాని ఇకమీదట ఆమెను తిట్టడం వంటివి చేయనని అంటున్నాడు దర్శక దిగ్గజం రాజమౌళి. ముఖ్యంగా ఈ మార్పుకు కారణం ''మనమంతా'' సినిమాయేనట.
''తను కాలేజ్ చదివే రోజుల్లో ఎన్.సి.సి. ద్వారా కెనడా వెళ్ళే ఛాన్సొచ్చింది. కాని రమా మాత్రం ఇక్కడే ఉండిపోయింది. వాళ్ళమ్మతో ఉండటమే ఇష్టమని చెప్పిందట. నేను ఆ విషయంలో ఎప్పుడూ తిడుతూ ఉండేవాడిని. ఒకవేళ కెనడా వెళ్ళుంటే లైఫ్ ఇంకోలా ఉండేది కదూ అంటూ టీజ్ చేస్తుంటాను. కాని ఇప్పుడు అలా చేయడం మానేశాను'' అంటున్నాడు రాజమౌళి. ఈ మార్పుకు కారణం ఏంటంట?
''మనమంతా సినిమాలో గౌతమి రోల్ చూడండి.. ఆమె సింగపూర్ వెళ్తాను అనగానే.. డబ్బులు ఎక్కువొస్తాయి కాబట్టి భర్త ఓకె అంటాడు.. తమ ఫ్యూచర్ బాగుంటుందని కొడుకు ఓకె అంటాడు.. మా అమ్మ ఫ్లయిట్ లో వెళ్తోందని అందరికీ చెప్పుకుంటా అంటూ కూతురు వెళ్లమంటుంది. కాని తను లేకపోతే బాధపడతాం ఇబ్బందిపడతాం అని ఒక్కరూ చెప్పరేంటి అని ఆమె బాధపడుతుంది. సో.. నా విషయంలో కూడా నేను నా పరస్పెక్టివ్ చెబుతున్నా కాని.. రమా పరస్పెక్టివ్ ఆలోచించలేదు. ఈ సినిమా చూశాక రియలైజ్ అయ్యా'' అంటూ తెలిపాడు జక్కన్న.
మొత్తానికి రాజమౌళి వంటి అగ్ర స్థాయి దర్శకుడు కూడా.. వేరొకరి సినిమాను చూసి ఇలా ప్రభావితం చెందుతారనమాట. అది సినిమా పవర్. సారీ.. ఒక మంచి సినిమాకు ఉన్న పవర్.