Begin typing your search above and press return to search.

ఆ లెక్కన చూస్తే రాజమౌళికి 50 కోట్లా?

By:  Tupaki Desk   |   4 Aug 2016 9:47 AM GMT
ఆ లెక్కన చూస్తే రాజమౌళికి 50 కోట్లా?
X
జక్కన్న రాజమౌళి. పేరుకు తగ్గట్లే సినిమాలను బాగా చెక్కుతాడు. మూడు సంవత్సరాల టైమ్ తీసుకుంటున్నాడు.. ఏం చెక్కుతాడోలే అనుకుంటే.. మనోడు బాహుబలి అంటూ ఒక దృశ్యకావ్యం చూపించాడు. విమర్శకులకు ఎలా అనిపించినా.. విదేశాల్లో ఆడినా ఆడకపోయినా.. సినిమా మాత్రం 600 కోట్లు వసూలు చేసిందంటే.. అది ఖచ్చితంగా రాజమౌళి అసమాన ప్రతిభే. అందుకే మనోడికి ఆ రేంజులో రెమ్యూనరేషన్ కూడా ఇవ్వాలిగా.

నిజానికి మొదటి భాగం రిలీజైనప్పుడు.. మనోడికి 20 నుండి 30 కోట్లు పేమెంట్ ఇస్తున్నారు అంటూ వార్తలొచ్చాయి. మన తెలుగులో మహేష్‌ బాబు - పవన్‌ కళ్యాణ్‌ వంటి స్టార్లు తీసుకుంటున్న 25 కోట్లే అత్యధిక రెమ్యూనరేషన్‌. అంతకంటే ఎక్కువ ఎవ్వరూ తీసుకోవట్లేదు. సో వాళ్ళతో సమానంగా రాజమౌళికి ఇచ్చుంటారు అని అందరూ అనుకున్నారు. అయితే తొలి భాగం అద్భుతంగా సక్సెస్ అవ్వడంతో రెండో భాగం కోసం మనోడు మాంచి డీల్స్ వర్కవుట్ చేశాడట. అదేంటంటే.. బాహుబలి 2 సినిమాను తెలుగులో తప్పించి మిగిలిన అన్ని చోట్లా ఎంతకి అమ్ముతారో ఆ ప్రైస్ లో తనకు సగం ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడట రాజమౌళి.

ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కాని.. ఆ లెక్కన చూసుకుంటే మాత్రం.. మనోడికి 50 కోట్ల షుమారు గిడుతుంది. ఇప్పటికే బాహుబలి 2వ భాగాన్ని తమిళంలో 45 కోట్లకు.. మలయాళంలో 10+ కోట్లకు.. హిందీలో 40 కోట్లకు అమ్మినట్లు సమాచారం ఉంది. ఒకవేళ హిందీ రేట్లు ఇంకా ఎక్కువ పలికితే మాత్రం రాజమౌళికి 50కు పైగా చేతికొస్తుంది. ఎంత కష్టానికి అంత ఫలితం అంటే ఇదే.