Begin typing your search above and press return to search.

థియేటర్ల పరిస్థితిపై జక్కన్న కామెంట్స్‌

By:  Tupaki Desk   |   19 April 2020 4:00 PM GMT
థియేటర్ల పరిస్థితిపై జక్కన్న కామెంట్స్‌
X
గత రెండు రోజులుగా రాజమౌళి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆర్‌ ఆర్‌ ఆర్‌ చిత్రం గురించి టాలీవుడ్‌ ప్రస్తుత పరిస్థితి గురించి ఇతర విషయాల గురించి రాజమౌళి ఇంటర్వ్యూల్లో మాట్లాడాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ లాక్‌ డౌన్‌ వల్ల టాలీవుడ్‌ ఎదుర్కొంటున్న పరిస్థితిపై స్పందించాడు. థియేటర్లు మళ్లీ యధావిధిగా నడవాలంటే కనీసం ఆరు నెలల సమయం అయినా పడుతుందని రాజమౌళి పేర్కొన్నాడు.

ఇటీవలే ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు మాట్లాడుతూ థియేటర్లను కనీసం రెండు మూడు నెలలు మూసేస్తే బాగుంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేశాడు. అయితే సురేష్‌ బాబు వ్యాఖ్యలపై థియేటర్ల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పటికే థియేటర్లు మూత పడటంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సమయంలో మరో మూడు నెలలు హాల్స్‌ మూసి ఉంచాలని అనడం దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సురేష్‌ బాబు అన్నట్లుగానే ఇప్పుడు రాజమౌళి కూడా థియేటర్లకు మళ్లీ ప్రేక్షకులు క్యూ కట్టాలంటే ఆరు నెలల సమయం పడుతుందని అనడంతో ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ ఆర్‌ ఆర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రాబోతున్న విషయం తెల్సిందే. అప్పటి వరకు ఈ పరిస్థితి అంతా కూడా సాదారణ రీతికి వస్తుందని ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు.