Begin typing your search above and press return to search.

కట్టప్ప ప్రొడ్యూసరా? డైరక్టరా? ఆర్టిస్టేగా..

By:  Tupaki Desk   |   14 April 2017 1:19 PM GMT
కట్టప్ప ప్రొడ్యూసరా? డైరక్టరా? ఆర్టిస్టేగా..
X
ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం నటుడు సత్యరాజ్ కావేరి నదీజలాల షేరింగ్ విషయంలో కొన్ని కామెంట్లు చేశాడు. మనోడు తమిళుడు కాబట్టి.. ఖచ్చితంగా కన్నడిగులకు వ్యతిరేకంగానే కామెంట్ చేశాడులే. అయితే ఆ కామెంట్లను ఇప్పుడు మనస్సులో పెట్టుకుని.. సత్యరాజ్ కట్టప్పగా నటించిన బాహుబలి 2 సినిమా రిలీజ్ ను అడ్డుకుంటాం అంటూ వార్నింగ్ ఇచ్చారు కన్నడ సంఘాల వారు.

ఈ మొత్తం యవ్వారంపై స్పందించిన దర్శకుడు రాజమౌళి.. ఇది అన్యాయం అంటున్నాడు. ''ఎప్పుడో 9 ఏళ్ళ క్రితం వ్యాఖ్యలు చేస్తే.. ఇప్పుడు బాహుబలి సినిమాను అడ్డుకుంటానని చెప్పడం సమంజసం కాదు. అయినా కూడా ఆయన ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే. ప్రొడ్యూసర్ కాదు. డైరక్టర్ కాదు. అయినాసరే ఫ్రీడమ్ ఆఫ్‌ స్పీచ్ అనేది ఒకటుందిగా. ఎవరికి తోచింది వారు చెప్పుకుంటారు. అందుకని సినిమాను ఆపేస్తానంటే ఎలా?'' అంటున్నాడు జక్కన్న.

అయితే కన్నడిగులు మాత్రం.. సుప్రీమ్ కోర్టు కావేరి జలాల విషయంలో కర్ణాటకకు అనుకూలంగా తీర్పునిస్తే తమిళనాట జనాలు ఎలా రెచ్చిపోయారో తెలిసిందే.. అప్పుడు లేదు కాని.. ఇప్పుడు మేం సినిమా ఆపితే ఏమొచ్చింది అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/