Begin typing your search above and press return to search.

పద్మ గౌరవం స్థాయి నాకు లేదు -రాజమౌళి

By:  Tupaki Desk   |   26 Jan 2016 4:17 AM GMT
పద్మ గౌరవం స్థాయి నాకు లేదు -రాజమౌళి
X
''అసలు ఏం చెప్పాలో అర్ధం కావట్లేదు. భిన్నమైన ఫీలింగ్స్‌ కలుగుతున్నాయి. అసలు ఈ గౌరవానికి నేను అర్హుడినని అనిపించట్లేదు. ఆ స్థాయి నాకు లేదు'' అంటున్నాడు జక్కన్న రాజమౌళి. ఈ గణతంత్ర దినోత్సవాన ఆయనకు పద్మశ్రీ అవార్డును భారత దేశ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అర్ధరాత్రి స్పందించిన రాజమౌళి.. ఈ విధంగా చెప్పుకొచ్చాడు.

''నేను ఏం సాధించానో నాకు తెలుసు. కాకపోతే ఈ ఘనత సాధించడానికి ఎంతో సృజనాత్మకంగా నేనేం చేయలేదు.. రామోజీరావు గారు, రజనీకాంత్‌ గారికి ఈ అవార్డులు దక్కడం చాలా సరైనది. కొన్ని తరాలు గుర్తుపెట్టుకునేంత ఘనత వారి సొంతం. వారి సరసన స్టేజీ షేర్‌ చేసుకోవడం అనేది కాస్త ఇబ్బందే. కాని.. అలాంటి వారి పక్కన నుంచుటున్నానంటే అదెంతో గౌరవదాయకం కూడా'' అంటూ తన భావనలను తెలిపాడు జక్కన్న.

ఇక రాజమౌళి ఈ అవార్డుకు అర్హుడా అనర్హుడా అంటూ అప్పుడు సోషల్‌ నెట్ వర్క్‌ లో పొగడ్తలు - విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.