Begin typing your search above and press return to search.

పోలికా.. ఎక్కడుందంటున్న రాజమౌళి

By:  Tupaki Desk   |   27 Jun 2015 5:30 PM GMT
పోలికా.. ఎక్కడుందంటున్న రాజమౌళి
X
రాజమౌళి తీసిన వాటిలో చాలా సినిమాలు హాలీవుడ్‌ కాపీలే అంటారు కొందరు జనాలు. రాజమౌళి కాపీ మూవీస్‌ అంటూ సోషల్‌ మీడియాలో తరచుగా పోస్టులు దర్శనమిస్తుంటాయి. ఏ సినిమాల నుంచి ఏమేం కాపీ కొట్టింది వీడియోలు చక్కగా ఎడిట్‌ చేసి పెడుతుంటారు కూడా. ఈగ సినిమాను 'కాక్‌రోచ్‌' నుంచి కాపీ కొట్టాడని.. మర్యాదరామన్న కాన్సెప్ట్‌ 'అవర్‌ హాస్పిటాలిటీ' నుంచి తీసుకుందని.. ఛత్రపతి, సై సినిమాలు కూడా కాపీలే అని ఆరోపిస్తుంటారు. రాజమౌళి మాత్రం తాను కాపీ కొట్టనని.. స్ఫూర్తి మాత్రమే పొందుతానని చెబుతాడు.

రాజమౌళి కొత్త సినిమా 'బాహుబలి'కి కూడా ఇప్పటికే కాపీ మరలు అంటాయి. మేకింగ్‌ వీడియోలు, పోస్టర్‌ విషయంలో విమర్శకులు రెచ్చిపోయారు. ఇప్పుడు 'బాహుబలి' సినిమా కూడా కాపీనే అంటూ కొన్ని వీడియోలు తయారయ్యాయి. బాహుబలి ట్రైలర్‌ రిలీజయ్యాక.. దానికి, 300 సినిమాకు ఇవిగో పోలికలంటూ పెద్ద లిస్టే తయారు చేశారు జనాలు. కానీ రాజమౌళి మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టిపారేశాడు. ఈ రెండు సినిమాలకు పోలికే లేదని.. బాహుబలి చాలా ప్రత్యేకమైన సినిమా అని చెప్పాడు రాజమౌళి. విజువల్స్‌లో పోలికలు ఉంటే ఉండొచ్చు కానీ.. బాహబలి కథ తన తండ్రి ఎంతో మక్కువతో మన నేటివిటీకి తగ్గట్లు తయారు చేసిందని చెప్పారు. 300కు, బాహుబలికి ఎలా పోలిక ఏర్పడిందో తనకు తెలియదని.. తాను తీసింది మాత్రం ప్రత్యేకమైన సినిమా అని నమ్ముతున్నానని చెప్పాడు రాజమౌళి.