Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ - చరణ్ లని అడ్డంగా బుక్ చేసిన జక్కన్న
By: Tupaki Desk | 11 Dec 2021 7:37 AM GMTరాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సారి కలిసి నటించిన చిత్రమిది. వచ్చే నెల 7న సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రిలీజ డేట్ దగ్గర పడుతున్న సందర్భంగాచిత్ర బృదం ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. ఇందులో భాగంగానే చిత్ర బృందం గత మూడు రోజుల నుంచి వరుస ప్రెస్ మీట్లతో మీడియా ముందు కొస్తున్నారు.
ముంబై, బెంగళూరులలో మీడియా సమావేశాలు నిర్వహించిన మేకర్స్ శనివారం హైదరాబాద్ లో తెలుగు మీడియాతో సమావేశమైంది. ఈ సందర్భంగా మీడయా ప్రతినధులు అడిగిన పలు ప్రశ్నలకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ , నిర్మాత డీవీవీ దానయ్య సమాధానాలిచ్చారు. అయితే ఈ సందర్భంగా ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది.
దర్శకుడు రాజమౌళి ఈ మూవీ షూటింగ్ సమయంలో ఇద్దరు హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నానని, సినిమాను తాను 300 రోజులు షూట్ చేసి వుంటే అందులో 20 నుంచి 25 రోజులు వీరిద్దరి కారణంగానే వృధా అయ్యాయని కామెంట్ చేశాడు.
రాజమౌళి తమ గురించి కామెంట్ చేస్తున్నాడని గ్రహించిన ఎన్టీఆర్ చిలిపి పని చేయడం అక్కడున్న వారిని నవ్వించింది. రాజమౌళి మాట్లాడుతుండగానే ఎన్టీఆర్ గట్టిగా గిల్లేయడం నవ్వులు పూయింది.
ఊహించని పరిణామానికి ఝల్లు మన్న రాజమౌళి పక్కన కూర్చోలేక పక్కకు వెళ్లి మాట్లాడటం మొదలుపెట్టాడు. ముప్పై ఏళ్లు పైనే వచ్చినయి ఇద్దరికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. వెనకాల కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.. అన్నా చచ్చిపోతాం అనే ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది..సెట్లో జక్కన్నా .. చరణ్ గిల్లు తున్నాడు అని వచ్చి ఎన్టీఆర్ కంప్లైంట్ చేస్తాడు..చరనేమో అమాయకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చి లేదే.. నేను లైన్స్ చూసుకుంటున్నానే అనే వాడు.
సెట్ లో దీని పై వాదన పది నుంచి పదిహేను నిమిషాల పాటు సాగేది` అంటూ జక్కన్న .. సెట్ లో రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల బాగోతాన్ని మీడియా సాక్షిగా బయటపెట్టి వారిని అడ్డంగా బుక్ చేయడం నవ్వులు పూయిస్తోంది.
ఈ రోజు ప్రెస్ మీట్ కొసమెరుపు ఏంటంటే ఇదంతా జరిగిన తరువాత ఇదే వేదికపై మీడియాకుఫొటోలకు పోజులివ్వడానికి ముందుకొచ్చిన ఎన్టీఆర్ ని స్మార్ట్ గా రామ్ చరణ్ గిల్లేయడం మరోసారి పవ్వులు పూయించింది. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.