Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు రాజమౌళి ఏం చెప్పాడు?
By: Tupaki Desk | 26 Feb 2017 10:46 AM GMTఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సలహా కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శకుడు రాజమౌళిని పిలవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. దీని మీద అనేకానేక ఊహాగానాలు వచ్చాయి. బోలెండంతమంది ఆర్కిటెక్టులు.. ఇంజినీర్లు ఉండగా ఓ సినీ దర్శకుడి సలహా అవసరమా అన్న విమర్శలు కూడా వినిపించాయి. ఇంతకీ చంద్రబాబు ఏం అడిగాడు.. రాజమౌళి ఏం చెప్పాడు అనే విషయంలో స్పష్టత లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి దీనిపై వివరణ ఇచ్చాడు.
‘‘చంద్రబాబు గారు అమరావతి నిర్మాణంలో నా సలహా కోరిన మాట వాస్తవం. అలాగని నాకు పెద్ద బాధ్యతలేమీ ఇచ్చేయలేదు. ఎంతోమంది పెద్ద పెద్ద ఇంజినీర్లు ఉండగా నేను చేసేదేముంది. నేనసలు ఇంటర్మీడియట్ కూడా పాసవలేదు. అదే విషయం ఆయనతో చెప్పాను. నేను చేయడానికి ఏముందని అన్నాను. తర్వాత సీఎంగారు మంత్రి నారాయణ గారు.. ఆయన పీఏను నా దగ్గరికి పంపాను. వాళ్లతో నేను గంటసేపు చర్చించాను. ఆ గంటలో ముప్పావు గంట.. నేను ఈ ప్రాజెక్టు కోసం ఎందుకు పని చేయలేనో వివరించాను. మిగతా సమయంలో మేం ‘బాహుబలి’కి సంబంధించి ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యామో చెప్పాను. ‘బాహుబలి’ కోసం వేసిన ప్రతి సెట్టింగ్ లోనూ ఒక థియరీ ఉంటుంది. ఒక రీజన్ ఉంటుంది. అదే విషయాన్ని వాళ్లకు చెప్పాను. అమరావతి అన్నది పీపుల్స్ క్యాపిటల్. ఆ కాన్సెప్టుకు తగ్గట్లుగా రాజధానిని నిర్మించాలన్నది నా అభిప్రాయం. ఆ ప్రకారం చేయాలనుకుంటే ‘బాహుబలి’ పని అయ్యాక నేను నా సలహాలు అందిస్తానని చెప్పాను. అదీ జరిగింది’’ అని రాజమౌళి వివరించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/