Begin typing your search above and press return to search.

నాన్నకు ప్రేమతో నో నాన్సెన్స్ మూవీ- రాజమౌళి

By:  Tupaki Desk   |   28 Dec 2015 9:59 AM GMT
నాన్నకు ప్రేమతో నో నాన్సెన్స్ మూవీ- రాజమౌళి
X
రాజమౌళి వేరే సినిమా దేని గురించైనా స్పందించాడు అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన పాజిటివ్ గా మాట్లాడిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. ‘నాన్నకు ప్రేమతో’ కూడా ఆ కోవలో చేరుతుందని ఉత్సాహంగా ఉన్నారు నందమూరి అభిమానులు. నిన్న విడుదలైన ట్రైలర్ చూసిన రాజమౌళి తన స్పందన తెలియజేశారు. ఎన్టీఆర్ ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నాడని.. ఈ చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాడని అభిప్రాయపడ్డాడు జక్కన్న.

‘‘ట్రైలర్ స్టైలిష్ గా, కూల్ గా ఉంది. ఎన్టీఆర్ ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే సుకుమార్ అతణ్ని చాలా డిఫరెంటుగా ప్రెజెంట్ చేశాడు. నాన్నకు ప్రేమతో నో నాన్సెన్స్ మూవీలా కనిపిస్తోంది. ప్రసాద్ గారికి, సుక్కు, బాపి.. ఇంకా టీం అందరికీ ఆల్ ద బెస్ట్. తారక్ తన 25వ సినిమాను ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు’’ అని రాజమౌళి ట్వీట్ చేశాడు.

రాజమౌళి ఇంతకుముందు ‘టెంపర్’ సినిమా గురించి కూడా ఇలాగే చాలా పాజిటివ్ గా మాట్లాడాడు. ఆ సినిమా హిట్టయింది. ‘నాన్నకు ప్రేమతో’కు కూడా జక్కన్న విషెస్ కలిసొచ్చి సినిమా పెద్ద హిట్టవుతుందేమో చూద్దాం. నాన్నకు ప్రేమతో ఆడియో, ట్రైలర్ విషయంలో అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాకే వస్తుండటం పట్ల ఎన్టీఆర్, సుక్కు సహా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు.