Begin typing your search above and press return to search.

ఈ రెండు వారాలు మళ్లీ వారిద్దరికి చుక్కలు చూపనున్న జక్కన్న

By:  Tupaki Desk   |   11 March 2022 11:30 PM GMT
ఈ రెండు వారాలు మళ్లీ వారిద్దరికి చుక్కలు చూపనున్న జక్కన్న
X
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తో సినిమా అంటే మామూలుగా ఉండదు. ఆయన సినిమా ను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండి తెరపై ఆయన సినిమా చూస్తున్నప్పుడు విజువల్ వండర్ అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ మేకింగ్ సమయంలో హీరోలు మరియు టెక్నిషియన్స్ పడే ఇబ్బందులు వారికి మాత్రమే తెలుస్తాయి అంటూ ఇండస్ట్రీ టాక్ ఉంది.

రాజమౌళి తన యొక్క సినిమా కోసం నటీనటుల నుండి మరియు సాంకేతిక నిపుణులు నుండి తనకు కావాల్సిన ఔట్‌ పుట్‌ ను పీల్చుకున్నాడు అంటూ ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. సినిమా బెస్ట్ ఔట్‌ పుట్‌ రావడం కోసం రాజమౌళి ఎంత దూరమైనా వెళ్తాడు.. ఎక్కడికైనా వెళ్తాడు. తాను వెళ్లడం మాత్రమే కాకుండా తన తోటి యూనిట్ సభ్యులందరిని కూడా తీసుకు వెళ్తాడు అనడంలో సందేహం లేదు.

సినిమా షూటింగ్‌ అయ్యింది.. తెరకెక్కించాను తన పని పూర్తయింది అనుకోకుండా రాజమౌళి ప్రమోషన్ విషయం లో కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆ జాగ్రత్తల వల్లే బాహుబలి సినిమాకి ఆ స్థాయి హైప్‌ క్రియేట్ చేయగలిగాడు. భారీ అంచనాల నడుమ ఇప్పుడు ఆయన తెరకెక్కించిన చిత్రం ఆర్‌.ఆర్.ఆర్ కి కూడా అదే రేంజ్ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నాడు. చేస్తున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసినంత పని చేసి పబ్లిసిటీ హడావు చేశారు. ముంబై.. బెంగుళూరు.. హైదరాబాద్ ఇలా అన్ని చోట్ల కూడా పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహించి హడావుడి చేశారు. సినిమా విడుదల తేది దగ్గర పడ్డ సమయంలో కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ వాయిదా వేశారు. మళ్లీ ఇప్పుడు విడుదల తేదీని ప్రకటించారు.

మార్చి 25 వ తారీఖున భారీ ఎత్తున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంతకు ముందు ప్రమోషన్ చేశాం కదా అని ఈసారి లైట్ తీసుకోకుండా.. మళ్లీ కూడా ప్రమోషన్స్ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఏ మాత్రం లైట్ తీసుకోకుండా దుబాయ్.. బెంగుళూరు.. హైదరాబాద్ ఇలా ముఖ్య పట్టణాలు అన్నింటిలో కూడా భారీ ఎత్తున ప్రమోషనల్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.

అంతే కాకుండా ఇద్దరు హీరోలు కూడా అటు ఇటుగా వంద ఇంటర్వ్యూలు ఇవ్వాలంటూ జక్కన్న సూచించాడట. జాతీయ మీడియా.. ప్రాంతీయ మీడియా.. వెబ్‌ మీడియా.. రేడియో.. ప్రింట్‌ మీడియా ఇలా అన్నింటికి కలిపి వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వాలంటూ ఇద్దరు హీరోలకు జక్కన్న ఆదేశాలిచ్చారు.

ఈ రెండు వారాల పాటు పూర్తిగా తాను చెప్పినట్లుగా హీరోలు ఇద్దరు ఉండి పోవాలని జక్కన్న అన్నాడని సమాచారం అందుతోంది. షూటింగ్ సమయంలో ఇద్దరు హీరోలు కూడా చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ప్రమోషన్స్ కోసం మరో రెండు వారాల పాటు కష్టపడాల్సి ఉంది. అయితే వారిద్దరు కూడా జక్కన్న సినిమా కోసం కష్టాన్ని ఇష్టంగా పడతామని పలు సందర్భాల్లో గతంలో చెప్పుకొచ్చారు. జక్కన్న సినిమా కోసం కష్టపడితే కచ్చితంగా ఫలితం ఉంటుందని వారికి తెలుసు. అందుకే జక్కన్న చెప్పిన దాన్ని పాటించడం లో ఏమాత్రం వెనుకంజ వేయరు.