Begin typing your search above and press return to search.

ఆర్‌ ఆర్‌ ఆర్‌ మల్టీస్టారర్‌ గురించి బ్యాడ్‌ న్యూస్‌

By:  Tupaki Desk   |   27 Aug 2018 1:07 PM GMT
ఆర్‌ ఆర్‌ ఆర్‌ మల్టీస్టారర్‌ గురించి బ్యాడ్‌ న్యూస్‌
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం తర్వాత చేయబోతున్న చిత్రం ఎన్టీఆర్‌ - రామ్‌ చరణ్‌ ల భారీ మల్టీస్టారర్‌ చిత్రం అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దాదాపు సంవత్సరం క్రితం ఈ చిత్రం గురించిన లీక్‌ వచ్చింది. ఇక కొన్ని నెలల క్రితం ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా గురించి ఎప్పుడైతే లీక్‌ వచ్చిందో అప్పటి నుండి కూడా ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ, ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలపై నీళ్లు జల్లుతుంది.

అసలు విషయం ఏంటీ అంటే ఈ భారీ మల్టీస్టారర్‌ ను నవంబర్‌ లేదా డిసెంబర్‌ లో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా నిర్మాత దానయ్య కొన్ని నెలల క్రితం ప్రకటించాడు. ఆ సమయంలోనే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందని చెప్పుకొచ్చాడు. అప్పటి నుండి కూడా సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతూనే ఉంది. దర్శకుడు రాజమౌళి స్క్రిప్ట్‌ విషయంలో ఎక్కడ రాజీ పడడు. ఒకసారి స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయితే మళ్లీ స్క్రిప్ట్‌ లో మార్పులు చేర్పులు చేయకూడదు అనేది ఆయన అభిప్రాయం. అందుకే స్క్రిప్ట్‌ వర్క్‌ ను హీరో మరియు హీరోయిన్స్‌ తో కలిసి మరీ చేస్తాడు. ప్రస్తుతం చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లు వారి వారి సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అందుకే స్క్రిప్ట్‌ చర్చల్లో వారు ఇంకా పాల్గొనలేదు. త్వరలోనే వారు చేస్తున్న సినిమాలు పూర్తి చేసుకుని స్క్రిప్ట్‌ వర్క్‌ లో భాగస్వామ్యం కాబోతున్నారు.

ఇంకా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి కానందున - హీరోయిన్స్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోని కారణంగా సినిమా అనుకున్న సమయంకు అంటే డిసెంబర్‌ లో ప్రారంభం కాకపోవచ్చునని - ఇక విడుదల ముందు నుండి చెబుతున్నట్లుగా 2020లో ఉండక పోవచ్చు అని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. జక్కన్న ఏం చేసినా కూడా ఆచి తూచి ఆలోచించి చేస్తాడు. ఎక్కడ కూడా తొందర పడడు. అందుకే ఈ చిత్రం కూడా చాలా ఆలస్యం అవుతుందని ఇప్పటికే ప్రేక్షకులు ఫిక్స్‌ అయ్యారు. కాని మరీ 2021 వరకు ఆగాలి వస్తుందని మాత్రం అనుకోలేదు. ఈ ఆర్‌ ఆర్‌ ఆర్‌ మల్టీస్టారర్‌ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక చిత్రం కోసం హైదరాబాద్‌ శివారు ప్రాంతం అయిన అల్యూమీనియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున సెట్టింగ్స్‌ ను నిర్మిస్తున్నారు. దానయ్య దాదాపుగా 300 కోట్ల బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.