Begin typing your search above and press return to search.

నో కంప్లైంట్స్‌..జ‌క్క‌న్న అంతా సెట్ చేశాడు

By:  Tupaki Desk   |   13 April 2022 1:30 PM GMT
నో కంప్లైంట్స్‌..జ‌క్క‌న్న అంతా సెట్ చేశాడు
X
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ట్రిపుల్ ఆర్` ఎట్ట‌కేల‌కు ఇటీవ‌ల విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు మోత మోగిస్తోంది. మెగా వ‌ప‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌సూళ్ల సునామీని సృష్టిస్తూ కాసులు వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే క్రేజీ చిత్రాల రికార్డుల్ని తిరిగ‌రాసిన ఈ మూవీ తాజాగా 1000 క్ట‌ల‌బ్ లో చేరి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. రానున్న రోజుల్లో ట్రిపుల్ ఆర్ మ‌రిన్ని రికార్డులు తిర‌గ‌రాయ‌డం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు గానూ, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీం గానూ న‌టించారు. సినిమా చూసిన వారంతా వీరిద్దు ఆ పాత్ర‌ల్లో ఒదిగిపోయిన తీరుకు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తెలుగు వారే కాకుండా విదేశీయులు కూడా స్టార్ హీరోల‌పై సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సినిమా ఆకాశానికి ఎత్తేసి ఇంత వ‌ర‌కు ఇలాంటి సినిమా చూడ‌లేద‌ని సోస‌ల్ మీడియా వేదిక‌గా ట్రిపుల్ ఆర్ కోసం వ్య‌క్త‌గ‌తంగా ప్ర‌చారం చేస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ కు ముందు కొమురం భీం ఫ్యామిలీ నుంచి `ట్రిపుల్ ఆర్` టీమ్ కు తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త మ‌య్యాయి. కొమురం భీం పాత్ర‌లో న‌టించిన ఎన్టీఆర్ ట్రైల‌ర్ లోని ఓ స‌న్నివేశంలో ముస్లీంగా మారి టోపీ ధ‌రించ‌డం క‌నిపించింది. దీనిపై కొమురం భీం ఫ్యామిలీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. అంతే కాకుండా అల్లూరి సీతారామ‌రాజు కుటుంబీకులు కూడా రాజ‌మౌళిపై విమ‌ర్శ‌లు చేశారు. చ‌రిత్ర‌లో నిలిచిపోయిన ఇద్ద‌రు లెజెండ‌రీ హీరోల చ‌రిత్ర‌ల‌ని త‌ప్పుగా చూపిస్తున్నారంటూ మండిప‌డ్డారు.

అంతే కాకుండా సినిమా విడుద‌లని నిలిపివేయాలంటూ తెలంగాణ హై కోర్టు లో ప్ర‌త్యేక పిటీష‌న్ కూడా వేశారు. అయితే వీటిపై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అప్ప‌ట్లో చాలా కూల్ గా స్పందించారు. రిలిజ్‌ త‌రువాత సినిమానే వారికి స‌మాధానం చెబుతుంద‌న్నారు. ఎన్టీఆర్ టోపీ ఎందుకు ధ‌రించాడో అందుకు ఓ కార‌ణం వుంటుంద‌ని, అది సినిమా చేస్తేనే అర్థ‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. జ‌క్క‌న్న భావించిన‌ట్టుగానే ట్రిపుల్ ఆర్ రిలీజ్ త‌రువాత కొమురం భీం వ‌ర్గం నుంచి కానీ, అల్లూరి వార‌సుల నుంచి కానీ ఎలాంటి కంప్లైంట్ వినిపించ‌లేదు.

అంతా కూల్‌. ఇటీవ‌ల రాజ‌మౌళి కొమురం భీం స్వ‌స్థ‌ల‌మైన అసిఫాబాద్ వెళ్లారు. అక్క‌డే భీం ఫ్యామిలీకి చెందిన వార‌సుల‌తో క‌లిసి సినిమా చూశారు. అక్క‌డ ఆయ‌న‌కు ల‌భించిన స్వాగ‌తం, ఆయ‌న‌ని ప్ర‌త్యేకంగా చూసిన తీరుని బ‌ట్టి భీం ఫ్యామిలీ వార‌సులు కూల్ అయిన‌ట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. సినిమా చూసిన త‌రువాత రాజ‌మౌళి తో పాటు భీం వార‌సులు కూడా మీడియాతో మాట్లాడారు. కానీ ఎక్క‌డా కంప్లైంట్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.