Begin typing your search above and press return to search.

RRR బాక్సింగ్ స్టోరీనే.. ప్రూఫ్ ఇదే

By:  Tupaki Desk   |   19 Nov 2018 5:30 PM GMT
RRR బాక్సింగ్ స్టోరీనే.. ప్రూఫ్ ఇదే
X
దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌ తో భార‌త‌దేశంలోనే అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంగా RRR పేరు మార్మోగిపోతోంది. హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఎస్.ఎస్.రాజ‌మౌళి సార‌థ్యంలో తొలి షాట్‌ కి క్లాప్ కొట్టేశారు. రోలింగ్ స్టార్ట్ అంటూ రాజ‌మౌళి అస‌లు యుద్ధం మొద‌లు పెట్టేశారు. రామ్‌ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తున్న ఈ చిత్రానికి `రామ రావ‌ణ రాజ్యం` అనే టైటిల్‌ కి ఫిక్స‌య్యార‌ని ఈ సంద‌ర్భంగా అభిమానుల్లో స్పెక్యులేష‌న్ న‌డుస్తోంది. ఈ టైటిల్‌ తో ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్లు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌ చ‌ల్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే రామ్‌ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో టైటిల్ పోస్ట‌ర్లు వేడెక్కిస్తున్నాయి. ఇదంతా ఒకెత్తు అనుకుంటే ఈ మ‌ల్టీస్టార‌ర్‌ కి సంబంధించిన ర‌క‌ర‌కాల అప్‌ డేట్స్ ఫ్యాన్స్‌ ని వేడెక్కిస్తున్నాయి.

గ‌త కొంత‌కాలంగా RRR క‌థేంటి? అంటూ ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెల‌కొంది. రామ రావ‌ణ రాజ్యం .. దొంగ పోలీస్ క‌థ‌..అందులోనే బాక్సింగ్ ఉంటుంది అంటూ చ‌ర్చ సాగింది. పీరియాడిక‌ల్ స్పోర్ట్స్‌ డ్రామా ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని మాట్లాడుకుంటున్నారు. కొంత మంది అభిమానులు మ‌రికాస్త ముందడుగు వేసి ఈ చిత్రంలో రామ్ పాత్ర‌లో చ‌ర‌ణ్‌ న‌టిస్తుంటే, రావ‌ణుడిగా తార‌క్‌ న‌టిస్తున్నాడని ప్ర‌చారం చేస్తున్నారు. అవునా..? ఇదంతా నిజ‌మేనా? అని సందేహిస్తుండ‌గానే .. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్ మూవీ అన్న సంకేతాలిస్తూ ప్ర‌ఖ్యాత స్టైలిష్ట్, `సై` స్టైలింగ్ ఫేం ది గ్రేట్ ఆలిం హ‌కీం బ‌రిలో దిగ‌డంతో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది.

ఈ చిత్రంలో తార‌క్ - చ‌ర‌ణ్ గెట‌ప్పుల‌పై ఇప్ప‌టికే బోలెడంత చ‌ర్చ సాగుతోంది. తార‌క్ భీక‌రాకారంతో క‌నిపిస్తే, అందుకు ధీటుగా క‌నిపిస్తూనే చ‌ర‌ణ్ కొత్త హెయిర్ స్టైల్‌ తో ద‌ర్శ‌న‌మిస్తాడ‌ని - మునుపెన్న‌డూ చూడ‌ని లుక్‌ తో స‌ర్‌ ప్రైజ్ చేస్తాడ‌ని మాట్లాడుకుంటున్నారు. స్టైలిష్ట్‌ హ‌కీం బ‌రిలో దిగుతూనే త‌న సామాజిక మాధ్య‌మాల్లో కొన్ని లీక్స్‌ని ఇచ్చారు. ``ఈరోజు చ‌ర‌ణ్‌ - రాజ‌మౌళి సర్‌ తో హైద‌రాబాద్‌ లో ఉన్నాను. మొద‌టిసారి రాజ‌మౌళి గారిని 15 ఏళ్ల క్రితం క‌లిశాను. 2004లో `సై` సినిమా కోసం నితిన్ హెయిర్ స్టైలింగ్ చేయాల్సిందిగా ఆయ‌న‌ అడిగారు. ర‌గ్బీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఆ సినిమా కోసం రాజ‌మౌళి నా చిన్న సెలూన్‌ కి రావ‌డం ఇప్ప‌టికీ గుర్తు ఉంది`` అనీ అన్నారు. దీనిని బ‌ట్టి మ‌రోసారి రాజ‌మౌళి ఎంచుకున్న క‌థేంటో అర్థ‌మైపోతోంది. స్పోర్ట్స్ నేప‌థ్యంలోని క‌థాంశంతోనే ఈ సినిమా చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ముఖ్యంగా బాక్సింగ్ నేప‌థ్యంలో భీక‌ర పోరాటాల‌తో స్ఫూర్తివంత‌మైన క‌థ‌తో ఈ చిత్రం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇందులో దొంగా పోలీస్ క‌థేంటి? అన్న‌ది కూడా ఆస‌క్తిక‌ర‌మైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తానికి అలీం హ‌కీం రాక‌తో RRR క‌థ‌పై కొంత క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టే.